AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్‭కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు.

AAP Offer to Congress: కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ బంపర్ ఆఫర్.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమంటూ ప్రకటన

APP vs Congress: కొద్ది నెలల్లో జరగబోయే మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామని ఆమ్ ఆద్మీ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పోటీకి దూరంగా ఉంటామని ఆప్ ప్రకటించడం గమనార్హం. అయితే దీనికి ఆ పార్టీ ఒక మెలిక పెట్టింది. ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీకి దూరంగా ఉంటామని ప్రకటిస్తే తామే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో పోటీ చేయమని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ గురువారం తెలిపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్రమోదీ తిరిగి ప్రధానమంత్రి అయితే దేశంలో నియంతృత్వం అధికారికం అవుతుందని, దాన్ని అడ్డుకోవడానికి ఆప్ ముందు వరుసలో ఉంటుందని ఆయన అన్నారు.

Uttar Pradesh : తాళి కట్టే సమయంలో అదనపు కట్నం డిమాండ్.. వరుడిని చెట్టుకు కట్టేసిన వధువు కుటుంబీకులు

‘‘రాజ్యాంగాన్ని మార్చి తానే రాజునని మోదీ ప్రకటించుకునే అవకాశం లేకపోలేదు. మళ్లీ గెలిస్తే దేశంలో నియంతృత్వం అధికారికం అవుతుంది’’ అని భరద్వాజ్ అన్నారు. విపక్ష నేతలపై ఈడీ, సీబీఐ, ఐటీ రైడ్లను ఇందుకు ఉదహారణగా ఆయన ప్రస్తావించారు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఆఫర్ ఇస్తూనే తమ విధానాలను ఆ పార్టీ కాపీ కొడుతోందని మండిపడ్డారు. హాయ్ పార్టీ ఆప్ ఆలోచనలను కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతోందని భరద్వాజ్ ఆరోపించారు. “దేశంలోని పురాతన పార్టీ అయిన కాంగ్రెస్‌లో నాయకుల సంక్షోభం మాత్రమే కాదు ఆలోచనల సంక్షోభం కూడా ఉంది. ఆప్ సంక్షేమ పథకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాల వంటిని కాంగ్రెస్ కాపీ చేస్తోంది” అని భరద్వాజ్ అన్నారు.

Union Minister House Set On Fire: మణిపూర్‌లో మళ్లీ హింసాకాండ..కేంద్రమంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి, దహనం

ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా చేసిన నిరసనలో ఆప్‭కు మద్దతు ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై భరద్వాజ్ విమర్శలు చేశారు. ఈ అంశంపై పార్టీ అధిష్టానం మాట్లాడవద్దని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం సూచించిందని అన్నారు. కేంద్రం ఆర్డినెన్స్‌పై అడిగిన ప్రశ్నకు భరద్వాజ్ సమాధానమిస్తూ, దేశ రాజధానిలో ఎన్నికైన ప్రభుత్వాన్ని పని చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. ఢిల్లీలోని అన్ని ఆసుపత్రులలో ప్రైవేట్ ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు నిలిపివేయబడుతున్నారని, జేజే క్లస్టర్లలో నివసించే ప్రజలను ఖాళీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.