Maharashtra Politics: పంతం నెగ్గించుకున్న అజిత్ పవార్.. పట్టుబట్టి మరీ ఆర్థిక శాఖ తీసుకున్నారు
తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్‌లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్‌కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు.

Ajit Pawar: బీజేపీ-శివసేన కూటమితో చేతులు కలిపి ఉప ముఖ్యమంత్రి అయిన ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవార్.. తన పంతాన్ని నెగ్గించుకున్నారు. తను కోరుకున్న ఆర్థిక శాఖను దక్కించుకున్నారు. కొత్త ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు కొత్తగా శాఖలు కేటాయించారు. ఈ కేటాయింపుల్లో అజిత్ వర్గానికి కూడా ప్రాధాన్యత ఉన్న శాఖలే దక్కాయి. అయితే తనకు ఆర్థిక శాఖ కావాలని అజిత్ పవార్ పట్టుబట్టారు. ఇది ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వద్ద ఉంది.
Moldova: ఎయిర్‌పోర్ట్‌లో కాల్పుల్లో ఇద్దరి మరణం అనంతరం రాజీనామా చేసిన ముగ్గురు మంత్రులు
అయితే తనకు అదే శాఖ కావాలని అజిత్ పట్టుబట్టి ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. క్యాబినెట్‌లో కీలకమైన ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖను అజిత్‌కు కేటాయించారు. వెంటనే ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. కాగా, తాజాగా శాఖల కేటాయింపుల్లో, ఎన్‌సీపీ సీనియర్ నేత ఛగన్ భుజ్‌బల్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. అనిల్ పటేల్‌కు రిలీఫ్ అండ్ రిహాబిలేషన్, డిజాస్టర్ మేనేజిమెంట్ శాఖ కేటాయించారు. అదితి సునీల్ టట్కరేకు మహిళ, శిశు అభివృద్ధి శాఖ కేటాయించగా, ధనంజయ్ ముడేకు వ్యవసాయం, దిలీప్ వాల్సే పాటిల్‌కు రెవెన్యూ, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి శాఖ కేటాయించారు.
Sheela Bhatt on PM Modi: ఎంఏ చదువుతుండగా మోదీని కలిశానన్న జర్నలిస్ట్.. మరోసారి చర్చలో మోదీ డిగ్రీ
తక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. బీజేపీ, శివసేనతో సహా మంత్రి పదవులు తీసుకుని, కొన్ని కీలక శాఖలు తీసుకున్నారు అజిత్ పవార్. దీంతో ప్రభుత్వంలో ఆయన వర్గం కీలకంగా మారింది. అయితే ఇది బీజేపీ నేతల్ని తీవ్ర ఇబ్బంది పెడుతోందట. 40 సీట్లు ఉన్న షిండే వర్గానికి ముఖ్యమంత్రి పదవితో పాటు ఎనిమిది మందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఇక కేవలం 30 స్థానాలే ఉన్న అజిత్ పవార్ వర్గానికి ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంత్రి పదవులు ఇచ్చారు. కానీ 105 స్థానాలున్న బీజేపీకి కూడా ఒక ఉప ముఖ్యమంత్రితో పాటు ఎనిమిది మంది మంత్రులు కేటాయింపులు అయ్యాయి. అయితే అజిత్ వర్గానికి కీలక శాఖలు ఇవ్వడంపై శివసేన వర్గంలోనూ అసంతృప్తి నెలకొందట.
Delhi..ECT: దేశంలోనే తొలి ఎలివేటెడ్ ట్యాక్సీవేను ప్రారంభించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా
ఎన్‌సీపీలో తిరుగుబాటు బావుటా ఎగురవేసిన అజిత్ పవార్ జూలై 2న తన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన ప్రభుత్వంలో చేరుతున్నట్టు ప్రకటించారు. తనకు 40మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఉందని, తమదే అసలైన ఎన్‌సీపీ అని ఆయన ప్రకటించారు. ఎన్‌సీపీ తరఫునే తాము ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించామన్నారు. అజిత్ పవార్ తో పాటు ఆయన తరఫున ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, అప్పట్నించీ శాఖల కేటాయింపు జరగలేదు.