జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : March 19, 2019 / 11:49 AM IST
జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు చేస్తున్నారు : సీఎం చంద్రబాబు

Updated On : March 19, 2019 / 11:49 AM IST

జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు.

అనంతపురం : జగన్, కేసీఆర్, మోడీ కలిసి కుట్రలు చేస్తున్నారని సీఎం విమర్శించారు. ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. విభజన హామీల కోసం పోరాడితే దాడులు చేయిస్తున్నారని వాపోయారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు…తెలంగాణలోని ఆస్తులను ఇంకా పంచలేదన్నారు. విభజన వల్ల ఆదాయం కోల్పోయామని తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం పెడితే అన్ని పార్టీలు మద్దతిచ్చాయని తెలిపారు. జగన్ కు కాపలాదారు నరేంద్ర మోడీ విమర్శించారు. అనంతపురంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు ప్రసంగించారు. 
Read Also : ఏపీలో ప్రలోభాలు : రూ.16.53 కోట్లు, రూ.4.22 కోట్ల బంగారం సీజ్ – ద్వివేదీ

నరేంద్రమోడీ చేతిలో జగన్ కీలు బొమ్మ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై ఆయనకు ఏమాత్రం ప్రేమలేదని విమర్శించారు. జగన్ ను చూస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని ఎద్దేవా చేశారు. ఆయన అపరాధ భావంతో బతుకుతారని చెప్పారు. ఎదుటివారిని నిందిస్తూ పబ్బం గడపాలని చూస్తారని విమర్శించారు. 12 కేసుల్లో జగన్ ముద్దాయన్నారు చంద్రబాబు. మైండ్ గేమ్ ఆడాలని చూస్తున్నారని తెలిపారు. అనంతపురం జిల్లా బాగుపడితే జగన్ చూడలేకపోతున్నారని విమర్శించారు. 

వివేకానందరెడ్డి హత్య తర్వాత సాక్ష్యాలను మాయం చేశారని ఆరోపించారు. హత్యను గుండెపోటుగా చిత్రీకరించారని చెప్పారు. వివేకా శరీరంపై గాయాలు ఉంటే గుండెపోటు అని ఎలా చెప్పారని ప్రశ్నించారు. వైసీపీ నేతలు పోటీ పడి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. సాక్ష్యాలను తారుమారు చేసినవారు కూడా నేరస్తులేనని చెప్పారు. జగన్ కుట్రలను తిప్పొకొట్టాలని పిలుపునిచ్చారు. ఏపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ పెత్తనం చేయాలనుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్.. జగన్ కు డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. మన ఆర్థిక మూలాలపై దెబ్బకొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. 
Read Also : రేపటి నుంచి హైటెక్ సిటీకి ’మెట్రో’ సేవలు