జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం : ఉద్యమాల కేసులు ఎత్తివేత

ఏపీలో జరిగిన పలు ఉద్యమాల్లో పెట్టిన పోలీసు కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది. భోగాపురం విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పెట్టిన కేసులను..జనవరి 2016 లో తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు ఉద్యమ సమయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తున్నట్లు ఫ్రభుత్వం తెలిపింది.
మాజీసీఎం రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత రిలయన్స్ ఆస్తుల ధ్వంసం కేసులో అనంతపురం, గుంటూరు జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో నమోదైన కేసులను ఎత్తివేస్తూ హోంశాఖ కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.