ఏపీ రైతులకు గుడ్ న్యూస్ : రూ.9 వేల పెట్టుబడి సాయం

5 ఎకరాలు, అంతకంటే ఎక్కువున్న రైతులకు 9 వేలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

  • Published By: veegamteam ,Published On : February 16, 2019 / 03:01 PM IST
ఏపీ రైతులకు గుడ్ న్యూస్ : రూ.9 వేల పెట్టుబడి సాయం

5 ఎకరాలు, అంతకంటే ఎక్కువున్న రైతులకు 9 వేలు ఇవ్వాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అమరావతి : ఏపీ రైతులకు శుభవార్త. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాలు, అంతకంటే ఎక్కువున్న రైతులకు 9 వేలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 5 ఎకరాలు లోపు ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6 వేలకు ఇది అదనం. కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయం రూ.6 వేలతో కలిపి మొత్తం రూ.15 వేలను ఏపీ ప్రభుత్వం రైతులకు అందించనుంది. 5 ఎకరాలకు పైన ఉన్న రైతులకు రూ.10 వేల పెట్టుబడి సహాయం అందివ్వనుంది. చిన్న, సన్నా కారు రైతుల ఇబ్బందుల దృష్ట్యా పెట్టుబడి సాయాన్ని రూ.4 వేల నుంచి రూ.9 వేలకు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు.