రాజధాని రైతులకు ఊరట : గడువు పెంచమని సీఆర్డీఏను ఆదేశించిన హైకోర్టు

  • Published By: chvmurthy ,Published On : January 17, 2020 / 03:35 PM IST
రాజధాని రైతులకు ఊరట : గడువు పెంచమని సీఆర్డీఏను ఆదేశించిన హైకోర్టు

Updated On : January 17, 2020 / 3:35 PM IST

రాజధాని  ప్రాంత రైతులు తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకోటావికి ఇచ్చిన గడువును పెంచాలని హై కోర్టు సీఆర్డీఏను ఆదేశించింది. తమకు ఇచ్చిన గడువు సరిపోవటంలేదని దాన్ని పెంచాలని కోరుతూ రాజధాని రైతులు హై కోర్టులో  పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన  న్యాయస్ధానం రైతులకు గడవు పెంచేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ ను ఆదేశించింది.

రైతుల తరుఫున టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ వాదించారు. రైతుల వాదనతో ఏకీభవించిన హై కోర్టు ఈనెల 20 మధ్యాహ్నం గం.2-30 వరకు గడువు ఇవ్వాలని ఆదేశించింది.  విచారణ అనంతరం  పిటీషనర్లు తరుపు న్యాయవాది కనకమేడల మాట్లాడుతూ… రైతులు తమ సమస్యలను ప్రభుత్వానికి వ్యక్తిగతంగా,లిఖిత పూర్వకంగానూ.. సీఆర్డీఏ వెబ్ సైట్ లోనూ. ఈమెయిల్ ద్వారాను తెలపవచ్చన్నారు. కాగా వెబ్ సైట్ లో సమస్యలురాకుండా  చూడాలని ఏజీని హై కోర్టు ఆదేశించిందని కనకమేడల చెప్పారు.