AP Elections 2024 : ఎన్నికల యుద్ధానికి ఎవరు సిద్ధం? ఎవరిలో సందిగ్ధం? ఏపీలో హీట్ పెంచుతున్న రాజకీయం
జన క్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయగా.. కూటమి మాత్రం తన వ్యూహం ఏంటో ఇంకా వెల్లడించలేదు.

YCP Vs TDP-Janasena
AP Elections 2024 : ఏపీ ఎన్నికల యుద్ధానికి ఎవరు సిద్ధం? అధికార వైసీపీ.. విపక్ష టీడీపీ-జనసేన కూటమి సమర సన్నాహాల్లో మునిగి తేలుతున్నాయి. 7 విడతల్లో దాదాపు 69 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన సీఎం జగన్.. నిన్న జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఇక మార్పులు లేనట్లేనని ప్రకటించారు. అంతేకాకుండా మిగిలిన ఎమ్మెల్యేలు, ఇంఛార్జ్ ల్లో దాదాపు అందరికీ టికెట్లు ఇచ్చే విషయంలో క్లారిటీ ఇచ్చేశారు. ఇక అదే సమయంలో టీడీపీ జనసేన కూటమి 99 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఇక మిగిలిన నియోజకవర్గాలకు ఎప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారన్నదే సస్పెన్స్ గా మారింది.
ఓవైపు సిద్ధం సభలో సీఎం జగన్ దూకుడు ప్రదర్శిస్తుండగా.. టీడీపీ-జనసేన కూడా మేమూ సిద్ధమే అంటున్నాయి. జన క్షేత్రంలోకి వెళ్లేందుకు వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయగా.. కూటమి మాత్రం తన వ్యూహం ఏంటో ఇంకా వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో ఎవరు సిద్ధం? ఇంకా ఎవరు సందిగ్ధంలో ఉన్నారు? తాజా రాజకీయ పరిణామాలపై ప్రత్యేక చర్చ..
Also Read : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?
పూర్తి వివరాలు..