17 స్థానాలకు 187 దరఖాస్తులు.. ఎంపీలుగా పోటీకి కాంగ్రెస్‌లో పోటాపోటీ

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు

17 స్థానాలకు 187 దరఖాస్తులు.. ఎంపీలుగా పోటీకి కాంగ్రెస్‌లో పోటాపోటీ

Big Competition For MP Seats In Telangana Congress

Updated On : January 30, 2024 / 10:10 PM IST

Telangana Congress : తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులుగా కాంగ్రెస్ ఆశావహుల నుంచి 187 దరఖాస్తులు వచ్చాయి. పార్లమెంట్ వారీగా డీసీసీల నుంచి వచ్చిన దరఖాస్తులు కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీకి చేరాయి. ఇవాళ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ కీలక సమావేశం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరెవరు నిలబడాలి? అనే దానికి సంబంధించి కీలకమైన మీటింగ్ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుల నుంచి ఆశావహుల జాబితాను స్వీకరించారు.

Also Read : తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఎంపీ బరిలో సోనియా గాంధీ..!

* ఆదిలాబాద్ నుంచి 20 దరఖాస్తులు
* పెద్దపల్లి – 11
* కరీంనగర్ – 02
* నిజామాబాద్ – 06
* మెదక్ – 02
* మల్కాజ్ గిరి – 08
* సికింద్రాబాద్ – 04
* హైదరాబాద్ – 10
* చేవెళ్ల – 06
* మహబూబ్ నగర్ – 04
* నాగర్ కర్నూల్ – 17
* నల్గొండ – 09
* భువనగిరి – 28
* వరంగల్ – 37
* మహబూబాబాద్ – 19
* ఖమ్మం నుంచి 03 దరఖాస్తులు వచ్చాయి.

Also Read : పార్లమెంట్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీరేనా?

అత్యధికంగా వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి 37మంది ఆశావహుల పేర్లు వచ్చాయి. వరంగల్ పార్లమెంట్ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. నాగర్ కర్నూల్ నుంచి 17 దరఖాస్తులు, పెద్దపల్లి నుంచి 11 దరఖాస్తులు వచ్చాయి. ఈ మూడూ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే. ఇక ఆదిలాబాద్ నుంచి 20, మహబూబాబాద్ నుంచి 19 ఆశావహుల పేర్లు వచ్చాయి. జనరల్ కేటగిరీ నియోజకవర్గాల నుంచి అతి తక్కువ అప్లికేషన్లు వచ్చాయి.