విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావుపేట నుంచి కన్నా : ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే

బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కొలిక్కి వచ్చింది. 182మంది అభ్యర్థులతో బీజేపీ లిస్ట్ విడుదల చేసింది. ఇందులో ఏపీ లోక్ సభ అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఏపీలో 25 లోక్ సభ స్థానాలకు గాను.. ఫస్ట్ లిస్ట్ లో 2 చోట్ల మాత్రమే అభ్యర్థులను అనౌన్స్ చేశారు. విశాఖ నుంచి పురంధేశ్వరి, నరసరావు పేట నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగనున్నారు.
విశాఖపట్నంలో సిట్టింగ్ ఎంపీ హరిబాబు అక్కడి నుంచి పోటీ చేయడానికి ఇష్టపడకపోవడంతో దగ్గుబాటి పురంధేశ్వరిని పోటీకి దించారు. దగ్గుబాటి పురందేశ్వరి గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014 ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు. ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, కుమారుడు హితేష్ చెంచురాం కొన్ని రోజుల క్రితం వైసీపీలో చేరారు. ఇప్పటికే ఏపీకి సంబంధించి 123 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను బీజేపీ రిలీజ్ చేసింది.
బీజేపీ ఏపీ ఎంపీ అభ్యర్థులు:
* విశాఖ – పురంధేశ్వరి
* నరసరావుపేట – కన్నా లక్ష్మీనారాయణ