హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు : ఎంపీ బాపూరావు
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు అన్నారు.

బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు అన్నారు.
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు అన్నారు. పాకిస్తాన్ లో హిందువులకు ఎదురయ్యే పరిస్థితే ఇక్కడి ముస్లింలకు ఎదురవుతుందన్నారు. రాహుల్, కేసీఆర్ లాంటి వాళ్లు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరని తెలిపారు. మోడీ, అమిత్ షా ఉన్నంత వరకు హిందువులకు ఏమీ కాదని భరోసా ఇచ్చారు.
జోగు రామన్న పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకోనని హెచ్చరించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు జోగు రామన్నకు రూ.50 వేలు ఇచ్చానని..తిరిగివ్వలేదని ఆరోపించారు. ఫామ్ హౌజ్ సీఎంకు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు.
గతంలో కూడా సోయం బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదు అయింది. ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు అతనిపై 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోయం బాపూరావు ముస్లింలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ ఆడపిల్లల జోలికొస్తే అంతుచూస్తామని హెచ్చరించారు.
నిర్మల్, ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో చాలా కాలంగా ముస్లిం యువత ఆదివాసీ యువతులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇకనైనా తీరు మార్చుకోకపోతే వారి తల తీసేస్తానని హెచ్చరించారు. బాపూరావు చేసిన ఈ వ్యాఖ్యల వీడియో అప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ మేరకు ఆయన చేసిన వ్యాఖ్యలపై ఓ వర్గం అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు.
ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా సోయం బాపూరావు గెలుపొందారు. లోక్ సభ ఎన్నికల సమయానికే ఆయనపై అత్యధికంగా 53 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్రంలోనే కేసుల విషయంలో ఆయన టాప్ లో ఉన్నారు.