Telangana Secretariat: ఏళ్లకు ఏళ్లు సెక్రటేరియట్‌లోనే తిష్ట..! వదిలి వెళ్లేది లేదని ఉద్యోగుల మంకు పట్టు..! ఎందుకిలా..
తెలంగాణ సెక్రటేరియట్లో 1500 మంది పైగా రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉంటే..400 మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. అన్ని శాఖల్లో 2వేల మంది ఉద్యోగులు ఉంటే..150 మంది మాత్రం గత నాలుగేళ్లుగా ఆయా శాఖల్లో తిష్ట వేసి కూర్చున్నారట.
- ఏళ్లుగా సెక్రటేరియట్‌లోనే అధికారుల తిష్ట.!
- కుర్చీలను పట్టుకొని వేలాడుతున్న ఉద్యోగులు
- ఇది మా అడ్డా అంటూ వదిలివెళ్లని కొందరు సిబ్బంది
Telangana Secretariat: ఏళ్లకు ఏళ్లు ఒకే దగ్గర తిష్ట. గబ్బిలాల లాగా కుర్చీలను పట్టుకుని వదలడం లేదట కొందరు అధికారులు. హైదరాబాద్ సెక్రటేరియట్‌ను వీడి వెళ్లేందుకు ఏ మాత్రం ఇష్ట పడట్లేదట ఉద్యోగులు. ఏళ్లుగా సచివాలయంలోనే తిష్టవేసిన ఆ అధికారులు ప్రభుత్వానికి తలనొప్పిగా మారారా? వారిని మరో చోటకు బదిలీ చేయకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?
సీఎంలు, మంత్రులు వస్తుంటారు. పోతుంటారు. కానీ మేమే కీలకం. మాదే రాజ్యం అంటున్నారట కొందరు అధికారురులు. స్టేట్ సెక్రటేరియట్లో ఏళ్లకు ఏళ్లుగా తిష్ట వేసి…ఏ బిడ్డా ఇది మా అడ్డా అంటూ..సెక్రటేరియట్‌ను వదిలి వెళ్లాలంటే చాలు మొండికేస్తున్నాట. తాము ఎంత చెప్తే అంత..తాము అనుకున్నదే రాజ్యం అన్నట్లుగా తోచింది చేసుకుంటూ పోతున్నారట. ప్రజా సమస్యలు..పెండింగ్‌లో పనులు పూర్తి చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆదేశించినా లైట్ తీసుకుంటున్నారట కొందరు ఆఫీసర్లు. తమకు నచ్చితే..తాము అనుకుంటే చకచకా ఫైల్స్‌ను కదలిస్తున్నారట. కీలక శాఖల ఉన్నతాధికారుల అండదండలతో..ఏళ్లకు ఏళ్లుగా కొందరు అధికారులు సెక్రటేరియట్‌లోనే ఉండిపోతున్నారట. ఎంతొస్తే అంత అన్నట్లుగా..కాసుల వెంట పరిగెడుతున్నారట. ఈ విషయం సర్కార్ పెద్దల చెవిలో పడటంతో కీలక శాఖల అధికారుల పనితీరుపై ఆరా తీసినట్లు సెక్రటేరియట్ వర్గాల టాక్.
అదే స్థానంలో 20 శాతం మంది ఉద్యోగులు..
తెలంగాణ సెక్రటేరియట్లో 1500 మంది పైగా రెగ్యులర్ ఎంప్లాయిస్ ఉంటే..400 మందికి పైగా ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారు. అన్ని శాఖల్లో 2వేల మంది ఉద్యోగులు ఉంటే..150 మంది మాత్రం గత నాలుగేళ్లుగా ఆయా శాఖల్లో తిష్ట వేసి కూర్చున్నారట. గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో సచివాలయ ఉద్యోగుల బదిలీలను చేపట్టారు. వీరిలో దాదాపు 80 శాతం మంది వివిధ హోదాల్లో ఉన్న ఉద్యోగులను, అధికారులను బదిలీలు చేశారు. మిగతా 20 శాతం మంది ఉద్యోగులు యథావిధిగా అదే స్థానంలో కంటిన్యూ అవుతున్నారట. ఫైళ్లు కదలాలన్నా, పనులు కావాలన్నా వీళ్లే చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కొందరు సెక్రటేరియట్ ఉద్యోగులు.
గతేడాది సెక్రటేరియేట్‌లో జరిగిన బదిలీల్లో 80శాతం మంది బదిలీ కాగా..ఇంకా 20శాతం మంది మాత్రం ఎప్పటిలాగే తమ కుర్చీల్లో కొనసాగుతుండటం హాట్ టాపిక్‌గా మారింది. దాదాపు 150మంది అధికారులు సెక్రటేరియట్ వీడకుండా..ఆయా శాఖల్లోనే తిష్ట వేయడం వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశంగా మారింది. జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సెక్షన్ ఆఫీసర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అడిషనల్ డైరెక్టర్ హోదాల్లో పని చేస్తున్న వారు కూడా నాలుగేళ్లుగా అక్కడే పని చేస్తున్నారు.
వారిని బదిలీ చేయాల్సిందేనని సెక్రటేరియట్ ఉద్యోగుల డిమాండ్.
గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. మూడేళ్ల పైబడి ఒకే చోట పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులే డిమాండ్ చేస్తుండటం విశేషం. ట్రాన్స్‌ఫర్స్‌పై నిషేధం ఎత్తివేసి..ఉద్యోగుల బదిలీలకు మరొక అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పటికే కొంతమంది బదిలీల కోసం ఆప్షన్లను ఇవ్వగా..కొద్దిమంది మాత్రం అదే ప్లేస్‌ను మళ్లీ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ మూడేళ్లుగా ఒకే చోట పని చేస్తున్న వారిని కచ్చితంగా బదిలీ చేయాలని సెక్రటేరియట్ ఉద్యోగులు పట్టబుడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి బదిలీల విషయంలో ఏం జరగనుంది అనేది తేలనుంది.
Also Read: ఇటు స్టేట్‌లో అటు సెంట్రల్లో.. మంత్రులకు కుర్చీ టెన్షన్.. ఎవరు ఇన్? ఎవరు ఔట్?
