14ఏళ్లు సీఎంగా పని చేసిన నన్ను అడ్డుకోవడం బాధాకరం : ఎంత అవమానించినా పోరాడతాం

అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం

  • Published By: veegamteam ,Published On : December 13, 2019 / 05:42 AM IST
14ఏళ్లు సీఎంగా పని చేసిన నన్ను అడ్డుకోవడం బాధాకరం : ఎంత అవమానించినా పోరాడతాం

Updated On : December 13, 2019 / 5:42 AM IST

అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం

అసెంబ్లీ గేటు దగ్గర గురువారం(డిసెంబర్ 12,2019) టీడీపీ నేతలు, మార్షల్స్ మధ్య జరిగిన ఘర్షణ అంశం సభను కుదిపేస్తోంది. నిన్నటి ఘర్షణకు సంబంధించిన వీడియోలను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రదర్శించింది. తప్పంతా టీడీపీ నేతలదే అని చెప్పింది. టీడీపీ నేతలు అసెంబ్లీ మార్షల్స్ పై దౌర్జన్యం చేశారని సీఎం జగన్ ఆరోపించారు.

మార్షల్స్ తమ విధులు నిర్వర్తించారని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా మరో గేటు నుంచి గుంపుగా టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వచ్చేందుకు ప్రయత్నం చేశారని, అందుకే మార్షల్స్ వారికి అడ్డు చెప్పారని సీఎం జగన్ చెప్పారు. అసెంబ్లీ ఉద్యోగులను చంద్రబాబు దుర్భాషలాడారని, లోకేష్ గొంతు పట్టుకున్నారని.. దౌర్జన్యంగా వ్యవహరించారని మండిపడ్డారు.

దీనిపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. 14ఏళ్లు సీఎంగా పని చేసిన తనతో మార్షల్స్ అనుచితంగా ప్రవర్తించారని చంద్రబాబు వాపోయారు. అసెంబ్లీలోకి రాకుండా తనను అడ్డుకోవడం బాధాకరం అన్నారు. తాను మార్షల్స్ ను దుర్భాషలాడలేదని చెప్పారు. సభలోకి వచ్చినప్పటి నుంచి మమ్మల్ని రోజూ అవమానిస్తున్నారని చంద్రబాబు వాపోయారు. తాము సభ్యత ప్రకారమే ప్రవర్తిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా ముందుకెళ్తామన్నారు.

ప్రతిపక్షాన్ని గౌరవించే విధంగా పరిపాలన ఉండాలని, ఉన్మాది పరిపాలన ఉండకూడదని చంద్రబాబు అన్నారు. తమను ఎంత అవమానించాని ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. పౌరుషంగా మాట్లాడటం, నేరాలు చేయడం తనకు తెలియదని చంద్రబాబు అన్నారు. మమ్మల్ని అవమానించి అధికార పక్షం నేతలు ఆనందపడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

* ప్రతి రోజూ సీఎం జగన్ దారుణంగా దుర్భాషలాడారు
* నేను ఎప్పుడూ పద్ధతి ప్రకారం ఉన్నా
* సభలో నన్ను చాలాసార్లు అవమానించారు
* మేము అధికారంలో ఉన్నప్పుడు మీపట్ల ఇలానే వ్యవహరించామా
* ఓ మంత్రైతే.. నీ అమ్మ మొగుగు అంటూ దుర్భాషలాడారు
* పాలన అంటే ప్రతిపక్షాలు కూడా మెచ్చేలా ఉండాలి
* నన్ను సభలోకి రానీయనందుకే గట్టిగా మాట్లాడాను
* కావాలనే మార్షల్స్ తో అడ్డగించారు.. ఇప్పుడు ఇలా మాట్లాడతారా
* వాట్ నాన్సెన్స్ అన్నానే తప్ప.. బాస్టర్డ్ అనలేదు
* నాకు జరిగిన అవమానానికి ఎవరు విచారం వ్యక్తం చేశారు
* నేను సీఎంగా ఉన్నప్పుడు జగన్ నన్ను ఉరేయమన్నారు
* మార్షల్స్ ను పెట్టి నన్ను ఆపినందుకు మీరు విచారం వ్యక్తం చేయండి
* జరిగిన దానికి నేను కూడా విచారణ వ్యక్తం చేస్తా