పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 09:57 AM IST
పీఎంకి ఒక రూల్.. సీఎంకి ఒక రూల్ ఉంటుందా

Updated On : May 28, 2020 / 3:41 PM IST

ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి ఈసీపై మండిపడ్డారు. సమీక్షలు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. తుఫాన్లు వచ్చినా సీఎం సమీక్షలు చెయ్యకూడదా అని అడిగారు. సమీక్షల విషయంలో ప్రధానికి ఒక  రూల్.. ముఖ్యమంత్రికి ఒక రూల్ ఉంటుందా అని చంద్రబాబు క్వశ్చన్ చేశారు. ప్రధానికి ఎన్నికల కోడ్ ఉండదు కానీ.. ముఖ్యమంత్రికి కోడ్ ఉంటుందా అని నిలదీశారు. ఈసీ వివక్ష చూపడం కరెక్ట్  కాదని చంద్రబాబు అన్నారు. అందరిని సమానంగా చూడాలని, నిబంధనలు వర్తింపజేయాలని చంద్రబాబు చెప్పారు.
Also Read : ఏపీలో జరిగినట్టే యూపీలో జరిగింది : ఎస్పీకి ఓటు వేస్తే బీజేపీకి పడింది

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత.. సీఎం చంద్రబాబు చేసిన సమీక్షలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రివ్యూలు చెయ్యడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన అని ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో రివ్యూలు చెయ్యడాన్ని, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడాన్ని ఎన్నికల కమిషన్ తప్పుపట్టింది. ఎన్నికల నియమావళి ప్రకారం చంద్రబాబు సూచనలు చేయొచ్చు కానీ, సమీక్షలు నిర్వహించడానికి వీల్లేదని ఈసీ స్పష్టం చేసింది. ఈసీ తీరుపై సీఎం చంద్రబాబు, టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ చెప్పినట్టు ఈసీ వ్యవహరిస్తోందని, బీజేపీని ప్రశ్నించిన వారిని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : మే మూడో వారంలో ఏపీ ఎంసెట్ ఫలితాలు