కేసులకు భయపడి కేసీఆర్‌కు లొంగిపోయారు : జగన్‌పై చంద్రబాబు ఫైర్

  • Published By: veegamteam ,Published On : March 13, 2019 / 12:24 PM IST
కేసులకు భయపడి కేసీఆర్‌కు లొంగిపోయారు : జగన్‌పై చంద్రబాబు ఫైర్

Updated On : March 13, 2019 / 12:24 PM IST

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. కేసులకు భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు సరెండర్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013లో బెయిల్ కోసం జగన్.. సోనియా కాళ్లు పట్టుకున్నారని అన్నారు. జగన్ అవినీతి తెలంగాణ ప్రభుత్వానికి కనపడదా అని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ నేరాలకు గ్రాండ్ మాస్టర్ అని చంద్రబాబు ఫైర్ అయ్యారు. చట్టంలో ఎన్ని నేరాలు ఉన్నాయో అన్ని నేరాలు చేసిన వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. షెల్ కంపెనీల పేరుతో దొంగ వ్యాపారాలు చేసిన వ్యక్తి జగన్ అని విమర్శించారు.
Read Also : షాకింగ్ : దగ్గుబాటికి టికెట్ పై జగన్ డైలమా!

నేరాలు ఎలా చేసి తప్పించుకోవాలో జగన్ కు బాగా తెలుసు అని జగన్ అన్నారు. ఏపీలో 9లక్షల ఓట్లు తొలగించాలని వైసీపీ నాయకులు ఫామ్ 7 దరఖాస్తులు ఇచ్చారని సీఎం ఆరోపించారు.  అభివృద్ధి ఎలా చేయాలని మనం ఆలోచిస్తే నేరాలు ఎలా చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఆస్తులపై ఈడీ మాజీ డైరెక్టర్ కర్నాల్.. సీబీఐ చీఫ్ కి 2017, మే 30న లేఖ  రాశారని.. లేఖలోని అంశాలపై దర్యాఫ్తు చేయకుండా ప్రధాని మోడీ తొక్కిపెట్టారని చంద్రబాబు అన్నారు.

టీడీపీ డేటా దొంగలించి అడ్డంగా దొరికిపోయారని చంద్రబాబు అఅన్నారు. ఏపీ ఇమేజ్ దెబ్బతీసేందకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నేరాల నుంచి తప్పించుకోవడానికి జగన్ కు..  కేసీఆర్, మోడీ దొరికారని అన్నారు. జగన్ అక్రమాస్తులను ఈడీ గుర్తించినా సీబీఐ దాచిపెట్టిందని చంద్రబాబు చెప్పారు. హైదరాబాద్ లోని డీజీపీ నివాసంసై వైసీపీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తే.. రాత్రికి  రాత్రే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అలాంటి కేసీఆర్ కు జగన్ కుంభకోణం కనపడలేదా అని చంద్రబాబు నిలదీశారు.
Read Also : నారా Vs నార్నే నిజమేనా : లోకేష్ ను ఢీ కొట్టేది ఎవరు