Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపై దృష్టి పెట్టామని చెప్పారు.

Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Chandrababu On Tdp Janasena Alliance

Chandrababu Naidu : టీడీపీ-జనసేన పొత్తు తమ కోసం కాదని ప్రజల కోసం అన్నారు మాజీ సీఎం చంద్రబాబు. టీడీపీ హయాంలో అనంతపురం జిల్లాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చామని, ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించామన్నారు. రాయలసీమకు నీళ్లు, పెట్టుబడులు, ఉద్యోగాలపై దృష్టి పెట్టామని చెప్పారు. సాగునీరు ఇస్తే అనంతపురం రైతులు బంగారం పండిస్తారని చంద్రబాబు చెప్పారు. అనంతపురం జిల్లా పెనుకొండలో రా కదలి రా సభలో చంద్రబాబు మాట్లాడారు.

”ఆరోజు ఈ జిల్లా కోసం నేను ఒక్కటే ఆలోచించా. నీళ్లు తెచ్చాం, కాలువ పనులు చేశాం, లిఫ్ట్ లు తెచ్చాం, ప్రాజెక్టులు పూర్తి చేశాం. జీడిపల్లి దగ్గర రాత్రంతా పడుకుని సమీక్షలు చేసి కరవు సీమలోకి నీళ్లు పరిగెత్తేలా చేసిన పార్టీ తెలుగుదేశం. మీకు కోపం లేదా? రోశం లేదా? ఇది అన్యాయమా కాదా? అని అడుగుతున్నా. మనమంతా పనికిరాని వాళ్లం అనుకుంటున్నారు. 600 ఎకరాలు నేను ఇచ్చాను. 50వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి” అని చంద్రబాబు అన్నారు.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?