Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!

Shashi Tharoor : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. కరోనా ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది.

Shashi Tharoor : మోదీ సర్కారును ఏకిపారేసిన శశి థరూర్.. ధరల మోతపై పోస్టు..!

Check Out Popular Fiction In India Tharoor's Swipe At Government Over Tackling Covid (1)

Updated On : May 20, 2022 / 7:43 PM IST

Shashi Tharoor : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయం సృష్టించింది. కరోనా ధాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. కరోనా కట్టడిలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ విఫలమైందంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా మోదీ సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఓ పుస్తకాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

‘ఏ నేష‌న్ టు ప్రొటెక్ట్’ అనే పుస్త‌కంతో ఫోటోను పోస్ట్ చేశారు. క‌రోనాపై ప్ర‌భుత్వ స్పంద‌న‌కు సంబంధించి ఈ పుస్త‌కంలో వివరించారు. ఓ బుక్ షాప్‌లో పాపుల‌ర్ ఫిక్ష‌న్ సెగ్మెంట్‌లో ప్ర‌ద‌ర్శిస్తున్న ఈ ఫోటోను క‌పిల్ సిబ‌ల్ తన పోస్టుకు జోడించారు. ప్రధాని మోదీ కవర్ పేజీతో వచ్చిన ఈ పుస్తకాన్ని ప్రియం గాంధీ రచించారు.


ఈ నేపథ్యంలో దేశంలో ద్ర‌వ్యోల్బ‌ణానికి మోదీ స‌ర్కార్‌ కారణమంటూ కాంగ్రెస్ నేత శ‌శి థ‌రూర్ మండిపడ్డారు. ఎన్‌డీఏ, యూపీఏ హ‌యాంలో ఆహార ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను పోల్చుతూ ఆయన కేంద్రంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలోనూ ప్ర‌స్తుత ఎన్‌డీఏ హ‌యాంలో ఒక‌టే వ్య‌త్యాసం ఉందన్నారు.

ధ‌ర‌ల మోతతో దేశ ప్ర‌జ‌లు ప్ర‌తిరోజూ ఇబ్బందులు పడుతున్నారని శ‌శి థ‌రూర్ దుయ్య‌బ‌ట్టారు. ఇన్‌ఫ్లేష‌న్ హ్య‌ష్‌ట్యాగ్‌తో థ‌రూర్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 2014లో బియ్యం, గోధ‌మలు, ఉల్లి, పంచ‌దార‌, ట‌మాట‌ వంటి ధ‌ర‌ల‌ను 2022లో ధ‌ర‌ల‌తో పోలిస్తూ శశి థరూర్ ఒక జాబితాను ట్విట్టర్‌లో షేర్ చేశారు.


Read Also : PM Birth Date Change: కలిసి రావడంలేదని పుట్టిన తేదీని మార్చుకుంటున్న ఆ దేశ ప్రధాని