జగన్ వస్తే జాబులు ఊడిపోతాయ్ : చంద్రబాబు

జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.

  • Published By: veegamteam ,Published On : March 27, 2019 / 11:02 AM IST
జగన్ వస్తే జాబులు ఊడిపోతాయ్ : చంద్రబాబు

Updated On : March 27, 2019 / 11:02 AM IST

జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు.

అనంతపురం : ఏపీకి ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని..జగన్ అధికారంలోకి వస్తే జాబులు ఊడిపోతాయని సీఎం చంద్రబాబు అన్నారు. మోడీ, కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పై తెలంగాణలో కేసులున్నాయని…అందుకే కేసీఆర్ కు జగన్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొని బలమైన నేత అని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గుత్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రసంగించారు. 

ఆత్మగౌరవాన్ని చంపుకోవద్దని హితవు పలికారు. మన ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే సహించేది లేదన్నారు. ఆంధ్రులను అవమానిస్తే వదిలిపెట్టనని హెచ్చరించారు చంద్రబాబు. ఈ ఎన్నికల్లో జగన్ ను ఓడించాలని పిలుపునిచ్చారు. వివేకానంద రెడ్డి హత్య ఇంటి దొంగల పనేనని స్పష్టం చేశారు.

పోలీసు అధికారులను ట్రాన్స్ ఫర్ చేసి ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. నదులను అనుసంధానం చేసి నీళ్లు ఇచ్చానని తెలిపారు. నీళ్లు కావాలా? హత్యలు కావాలా?… రౌడీయిజం కావాలా? అభివృద్ధి కావాలా? ప్రజలు తేల్చుకోవాలన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించామని తెలిపారు. బీసీలకు అండగా ఉండేది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. మైనార్టీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. జాబు రావాలంటే..మళ్లీ బాబు రావాల్సిందేనని స్పష్టం చేశారు.