బినామీలకు చంద్రబాబు భూములు దోచి పెట్టారు : సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరాతి భూములకు లక్ష కోట్ల రూపాయలు వెల కట్టారని తెలిపారు. సోమవారం (జనవరి 20, 2020) ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు.. తన బినామీలకు భూములను దోచి పెట్టారని విమర్శించారు. నిర్మాణాలకు అనువుగా లేని గ్రామాల్లో భూములు కొనుగోలు చేశారని చెప్పారు.
వాటర్ గ్రిడ్ లతో మంచి నీటి కొరతకు చెక్ పెడతామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు వస్తేనే కృష్ణా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు. రూ.15 వేల కోట్లు పోర్టులకు టాయిస్తామని చెప్పారు. రూ.40 వేల కోట్లతో ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టిస్తామని అన్నారు.
రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రాజెక్టులు నింపుకోలేని పరిస్థితి ఉందన్నారు. కరువుతో అల్లాడుతున్న జిల్లాలకు ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీతో నీటిని నింపాలి అంటే రూ.27 వేల కోట్లు అవసరం అవుతుందన్నారు. జలయజ్ఞం ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే రూ.30 వేల కోట్లు అవసరం అన్నారు.