తక్కువ ధరకి అమ్ముతున్నాము కాబట్టే క్యూలు : ఉల్లి ధరలపై సీఎం జగన్
ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు

ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు
ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. పెరిగిన ఉల్లి ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కిలో ఉల్లిపాయల కోసం క్యూలు కడుతున్నారని టీడీపీ సభ్యులు వాపోయారు. దీనిపై సీఎం జగన్ స్పందించారు. ఉల్లి కోసం క్యూలు ఎందుకు కడుతున్నారో వివరించారు. చంద్రబాబుకి చెందిన హెరిటేజ్ లో కిలో ఉల్లిని రూ.200కు అమ్ముతున్నారని ఆరోపించారు.
అయితే ప్రభుత్వం మాత్రం రైతు బజార్లలో కిలో ఉల్లిని రూ.25కే విక్రయిస్తోందన్నారు. తక్కువ ధరకే ఉల్లి విక్రయిస్తున్నాము కాబట్టే జనాలు క్యూలు కడుతున్నారని.. సీఎం జగన్ వివరించారు. చంద్రబాబుకి ఆ విషయం కూడా అర్థం కావడం లేదన్నారు.
ప్రతి దాన్ని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. శవాలపైనా రాజకీయం చేసేందుకు అలవాటు పడ్డారని విమర్శించారు. గుండెపోటుతో వ్యక్తి మరణిస్తే.. ఉల్లి కోసం క్యూలో నిల్చోలేక చనిపోయాడని ప్రచారం చేయడం దారుణం అన్నారు. ఉల్లి కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. 38వేల 496 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేసి ప్రజలకు సబ్సిడీపై అందించామన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా..ఏపీలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా కిలో ఉల్లిని రూ.25కే విక్రయిస్తున్నామని సీఎం తెలిపారు. చంద్రబాబు పాలనలో రైతులకు మద్దతు ధరలు ఇవ్వలేదన్నారు. ఉల్లిపాయలపై జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే బాధేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా తక్కువ ధరకు ఉల్లిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అని జగన్ చెప్పారు.