ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడతారా : సీఎం ఎన్నికల ప్రచారంపై ఉత్కంఠ
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్... గురువారం(అక్టోబర్

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్… గురువారం(అక్టోబర్
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో సమరశంఖం పూరించబోతున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ కంచుకోటను బద్దలుకొట్టి తమ జెండా ఎగరేయాలనుకుంటున్న కేసీఆర్… గురువారం(అక్టోబర్ 17,2019) మధ్యాహ్నం 2గంటలకు ప్రచారం నిర్వహించబోతున్నారు. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ బైపోల్‌పై పడుతుందేమోనని పార్టీ క్యాడర్ టెన్షన్ పడుతున్న నేపథ్యంలో… ఇక్కడ అడుగుపెట్టబోతున్న కేసీఆర్.. ఇదే వేదికపై ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడతారా? తెలంగాణ ప్రజలకు తన వాదన వినిపిస్తారా? లేదంటే… క్యాంపెయిన్‌తోనే సరిపెడతారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ప్రచారం ఇప్పటికే తారస్థాయికి చేరింది. అన్ని పార్టీల అభ్యర్థులు క్యాంపెయిన్‌తో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ గురువారం రంగంలోకి దిగుతున్నారు. హుజూర్‌నగర్‌లో జరిగే బహిరంగసభలో పాల్గొని… తమ అభ్యర్థి సైదిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే… ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది.
ఆర్టీసీ సమ్మె లోకల్‌గా హీట్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంలో.. గులాబీ జెండా ఎగరేసేందుకు పక్కా ప్లాన్‌తో దిగిన పింక్ ఆర్మీకి.. ఆర్టీసీ స్ట్రైక్ టెన్షన్ పెడుతోంది. సమ్మె మొదలై 13 రోజులైనా విషయం ఎటూ తేలకపోవడం, సమ్మెకు రోజురోజుకు మద్దతు పెరుగుతుండటం గులాబీ క్యాడర్‌లో గుబులు రేపుతోంది. సమ్మె ఎఫెక్ట్.. ఎక్కడ హుజూర్‌నగర్ బైపోల్‌పై పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు.
ఆర్టీసీ సమ్మెపై సమీక్షలు తప్ప నేరుగా ఇంతవరకు కామెంట్ చేయని కేసీఆర్….. హుజూర్‌నగర్ సభలో ఏం మాట్లాడతారనే దానిపై తెలంగాణ వాసులంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికి ఓటు వేయాలని కోరడంతోనే సరిపెడతారా? లేదంటే… సమ్మెపై స్పష్టమైన ప్రకటన చేస్తారా? అన్నది ఆసక్తి రేపుతోంది.
అయితే… ఇవాళ్టి సభ ద్వారా కేసీఆర్.. కార్యకర్తల్లో జోష్ నింపబోతున్నారని చెబుతున్నారు గులాబీ లీడర్లు. హుజూర్‌నగర్‌లో.. టీఆర్ఎస్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని.. భారీ మెజారిటీ కోసమే తమ ప్రయత్నమని చెబుతున్నారు. సభకు అన్ని ఏర్పాట్లు చేశామంటున్న మంత్రి జగదీశ్‌రెడ్డి… భారీ సంఖ్యలో జనం తరలివస్తారని చెబుతున్నారు. సీపీఐ మద్దతు లేకపోయినా గెలుపు జెండా ఎగురవేస్తామని ధీమాగా చెబుతున్నారు. తీవ్ర ప్రతికూలతలను సైతం తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్టగా పేరున్న కేసీఆర్… ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో హుజూర్‌నగర్ వేదికగా ఏం చేస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.