బ్రేకింగ్ : గవర్నర్‌‌ను కలవనున్న సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : November 25, 2019 / 07:57 AM IST
బ్రేకింగ్ : గవర్నర్‌‌ను కలవనున్న సీఎం కేసీఆర్

Updated On : November 25, 2019 / 7:57 AM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్..రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. 2019, నవంబర్ 25వ తేదీ సోమవారం గవర్నర్ తమిళిసైతో సమావేశం కానున్నారు. సీఎంతో పాటు..ఇతర అధికారులు ఉండనున్నారని తెలుస్తోంది. అందులో ఆర్టీసీ అధికారులు కూడా ఉంటారని సమాచారం. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తమిళిసైతో తొలిసారిగా కేసీఆర్ సమావేశం అవుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. 

ప్రధానంగా ఆర్టీసీ సమ్మెపైనే చర్చించనున్నట్లు తెలుస్తోంది. సమ్మె అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యలు..ప్రత్యామ్నాయ ఏర్పాట్లను వివరించనున్నారని సమాచారం. అలాగే రూట్ల ప్రైవేటీకరణ, ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే అంశం, కేంద్ర మోటార్ వెహికల్ చట్టానికి అనుగుణంగా కొత్త చట్టాన్ని అమలు చేయడం..తదితర విషయాలను గవర్నర్‌కు వివరించే ఛాన్స్ ఉంది. 

> రాష్ట్రంలో 50 రోజులకు పైగా ఆర్టీసీ కార్మికుల సమ్మె
> ప్రభుత్వ వైఖరిపై విపక్షాలు ఆగ్రహం
> గవర్నర్ జోక్యం చేసుకోవాలంటూ విపక్షాలు డిమాండ్
> గవర్నర్‌తో విపక్షాలు, ఆర్టీసీ జేఏసీ నేతలు ఇప్పటికే పలుమార్లు భేటీ
> ప్రాధాన్యత సంతరించుకున్న గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ