CM Revanth Reddy : వారికి రైతుబంధు కట్? ఎన్నికల లోపే చర్యలు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ మ్యాచ్ ఫిక్సింగ్ – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ మెదక్, బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్లను ఎందుకు ప్రకటించ లేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు.

CM Revanth Reddy : వారికి రైతుబంధు కట్? ఎన్నికల లోపే చర్యలు, బీజేపీ బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ మ్యాచ్ ఫిక్సింగ్ – సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy Allegations On BJP And BRS

CM Revanth Reddy : బీజేపీ, బీఆర్ఎస్ సీక్రెట్ ఫిక్సింగ్ చేసుకున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇందుకు ఎంపీ అభ్యర్థుల జాబితానే సాక్ష్యం అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్లను ప్రకటిస్తున్నాయని చెప్పారు. బీజేపీ మెదక్, బీఆర్ఎస్ చేవెళ్ల టికెట్లను ఎందుకు ప్రకటించ లేదని సీఎం రేవంత్ రెడ్డి నిలదీశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కేసీఆర్ ముసుగులు తొలిగిపోయాయన్నారు.

మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను టార్గెట్ చేశారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

నన్ను దించాలంటే కేసీఆర్‌ మోదీతో కలవాలి..
”రాష్ట్రంలో ప్రతిపక్ష నేత లేడు. ఐదు నెలల్లో నన్ను దించుతానంటున్నారు. నన్ను దించాలంటే కేసీఆర్‌ మోదీతో కలవాలి. నేను మోదీని పెదన్న అన్నందుకు రచ్చ చేస్తున్నారు. అమెరికాను అగ్రరాజ్యం అంటారు కదా. అదే మాదిరిగా ఆయన ప్రధాని కాబట్టి పెద్దన్న అన్నా. మోదీతో అభివృద్ధిపై మాత్రమే చర్చించా. కేసీఆర్‌లా గదిలోకి వెళ్లి చెవిలో చెప్పలేదు. మేడిగడ్డపై NDSAకు లేఖ రాశా. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వొచ్చు.

ఎవరైనా దొంగల సలహా తీసుకుంటారా?
సంపదను శ్రీమంతులకు ఎట్టి పరిస్థితుల్లో పంచం. కేసీఆర్, లక్ష్మణ్ ఒకేలా మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వం పడిపోతుందని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. కాళేశ్వరంను ముంచిందే కేసీఆర్, హరీశ్. మళ్లీ వాళ్ల సలహాలు ఎలా తీసుకోమంటారు? ఎవరైనా దొంగల సలహా తీసుకుంటారా?
నిపుణుల రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరంపై ముందుకెళతాం. కేసీఆర్ ను ప్రజలు ఓడించి రాజకీయ శిక్ష వేశారు. బీఆర్ఎస్ ను బండకేసి కొట్టి బొంద పెట్టారు. మోడీ, అమిత్ షా పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తాం. సీఎంను కలిస్తే తప్పేంటి? కేసీఆర్ చేసిన పాపంతో ప్రతి ఒక్కరినీ అనుమానిస్తున్నారు. తమ్మిడిహట్టి నుండి ప్రాజెక్ట్ నిర్మాణం అవసరం. ఆదిలాబాద్ కు లక్ష 60 వేల ఎకరాలకు నీళ్లొస్తాయి.

నివేదిక అందాక చర్యలు..
మా కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు రెండున్నర కోట్ల ఇసుక ఆదాయం పెరిగింది. జీఎస్టీ 500 కోట్ల ఆదాయం పెరిగింది. ఎల్ఆర్ఎస్ పై అధికారుల నివేదిక వచ్చాక స్పష్టత ఇస్తాం. సీఏంఆర్ఎఫ్ పై ఇంటర్నల్ ఆడిట్ జరుగుతోంది. చర్యలు తీసుకుంటాం. మా పరిపాలన రెఫరెండంగానే ఎన్నికలకు వెళ్తాం. లోక్ సభ లో 14కు పైగా సీట్లు గెలుస్తాం.

ట్యాక్స్ పేయర్స్ కు రైతుబంధు ఎందుకు..?
ట్యాక్స్ పేయర్స్ కు రైతుబంధు ఎందుకు..? వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందిస్తాం. దీనిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకుంటాం. గజ్వేల్, జన్ వాడ ఫాం హౌస్ రైతులకు రైతుబంధు ఇవ్వాలా? అన్ని ప్రైవేటు యూనివర్సిటీలపై విచారణ జరుపుతాం. కేటీఆర్ రోజంతా ధర్నా చేయాలి.

రాహుల్ గాంధీ తెలంగాణలో పోటీ చేస్తే రాష్ట్ర గౌరవం పెరుగుతుంది. కేసీఆర్ వందేళ్ల విధ్వంసం చేస్తే.. వంద రోజుల్లో పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నాం. నన్ను ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కలవడంలో ఎలాంటి రాజకీయం లేదు. సీఎంను ఎమ్మెల్యేలు కలిస్తే ఏదో జరుగుతున్నట్లుగా కేసీఆర్ చేశారు.
ఫైనల్ గా ఎన్డీఎస్ యే చెప్పిందే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. మా ప్రభుత్వం ఎందుకు పడిపోతుందో విమర్శించే వారే చెప్పాలి. అసెంబ్లీకి రాని నేత ప్రతిపక్ష నేత ఎలా అవుతారు? దేశానికి ప్రధాని పెద్దన్నే కదా. నేను అన్నదాంట్లో తప్పేముంది?

ఆ రోజున కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన..!
బీజేపీ, బీఆర్ఎస్ మధ్య సీక్రెట్ ఫిక్సింగ్ ఉంది. ఆ రెండు పార్టీలు ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల లిస్ట్ చూస్తుంటే.. వారిద్దరి మ్యాచ్ ఫిక్సింగ్ అర్థం అవుతుంది. కాంగ్రెస్ 100 రోజుల పరిపాలన కొలబద్ద. డిసెంబర్ నుండి ఎన్నికల నాటికి మా పనితనం లెక్కించే ఓట్లేయండి. కేసీఆర్ లా నేను ప్రధాని చెవిలో గుసగుసలు చెప్పలేదు. అంతా మైక్ లో చెప్పాను. బీజేపీ నేతలు ప్రధానిని తప్పుదోవ పట్టించారు. కాళేశ్వరంపై 4 వారాల్లో నివేదిక ఇస్తే.. ఎన్నికల లోపే చర్యలు తీసుకుంటాం. తుమ్మిడిహట్టి నిర్మించి ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తాం. బీజేపీ, బీఆర్ఎస్ అంతర్గత ఒప్పందంతో టికెట్ల ప్రకటన. 7 లేదా 8 న సీఈసీ మీటింగ్ ఉంది. అదే రోజు కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉండొచ్చు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : లోక్‌సభ ఎన్నికలు.. తెలంగాణ ఎవరి వైపు? ఆ 3 పార్టీల భవిష్యత్ ఏంటి?