సీఎం జగన్ 3 రోజుల కడప పర్యటన

  • Published By: chvmurthy ,Published On : December 22, 2019 / 11:55 AM IST
సీఎం జగన్ 3 రోజుల కడప పర్యటన

Updated On : December 22, 2019 / 11:55 AM IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 23వ తేదీ సోమవారం నుంచి 25వతేదీ బుధవారం వరకూ ఆయన జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తొలి రోజు సోమవారం స్టీల్‌ ప్లాంట్‌కు పునాది రాయి వేయనున్నారు. అలాగే పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కడప, రాయచోటి ప్రాంతాల్లో అభివృధ్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. మరోవైపు జిల్లాలో సీఎం పర్యటనపై పోలీసులు అప్రమత్తం అయ్యారు. భద‍్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం జగన్‌ కడప జిల్లా పర్యటన షెడ్యూల్‌ ఇలా ఉంది

23.12.2019 (సోమవారం)
ఉదయం 9.20 – కడపలో రైల్వే ఓవర్‌బ్రిడ్జి ప్రారంభం
9.55 గంటలకు – రిమ్స్‌లో వివిధ అభివృద్ది పనులకు శంకుస్ధాపన
10.30 గంటలకు– వైఎస్సార్‌ ఉచిత భోజన వసతి భవనం ప్రారంభం
11.50 – జమ్ములమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో ఏపీ హైగ్రేడ్‌ స్టీల్స్‌కు సీఎం శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ లో ప్రసంగిస్తారు.
మధ్యాహ్నం 2.15 గంటలకు – దువ్వూరు మండలం నేలటూరు వద్ద మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలకు సంబంధించిన అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన చేసిన అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.
సాయంత్రం 5 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు.

24.12.2019 (మంగళవారం)
 ఉదయం 9.05 గంటలకు – ఇడుపులపాయ వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుంటారు.
 9.10 – దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళి
మధ్యాహ్నం గం.2.00 – రాయచోటి సభాస్ధలికి ముఖ్యమంత్రి చేరుకుంటారు
 2.15 – వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్ధాపన, అనంతరం బహిరంగసభ
 5.00 – పులివెందుల భాకరాపురంలోని నివాసానికి చేరుకుంటారు సీఎం జగన్.
 

25.12.2019 (బుధవారం)
 ఉదయం గం.9.20 – క్రిస్మస్ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. 
 ఉ.గం.11.15ని.లకు – పులివెందుల జూనియర్‌ కళాశాల మైదానంలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన, వైఎస్సార్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభం
మ.గం. 3.00 – కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయలుదేరుతారు.