ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నిరవధిక వాయిదా

  • Published By: chvmurthy ,Published On : February 8, 2019 / 01:35 PM IST
ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు: నిరవధిక వాయిదా

Updated On : February 8, 2019 / 1:35 PM IST

అమరావతి: దాదాపు వారం రోజులపాటు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సమావేశం చివరిలో  ఉద్వేగభరితంగా ముగిసింది. సభ్యులంతా చప్పట్లు కొట్టి చంద్రబాబును అభినందనల్లో ముంచెత్తారు. అటు.. ఢిల్లీలో చంద్రబాబు ధర్మపోరాట దీక్షకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఇందుకోసం శ్రీకాకుళం, అనంతపూర్‌ నుంచి రెండు రైళ్లు కూడా బయల్దేరాయి. సభలో ప్రభుత్వం 20 బిల్లులు ప్రవేశ పెట్టింది. 38గంటల పాటు సభ జరిగింది. చివరి రోజు సీఎంకు అభినందనలు తెలిపిన సభ్యులు. మళ్లీ మనమే మనమే రావాలి…థాంక్యూ సీఎం సార్ అంటూ సభలో సభ్యుల స్లోగన్స్ ఇస్తూ సీఎం కు అభినందనలు తెలిపారు.

కాగా… స్పీకర్‌గా అవకాశం రావడం గొప్ప విషయమని కోడెల శివప్రసాదరావు అన్నారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావడానికి సహకరించిన ప్రతిపక్ష పార్టీకి ఈ సందర్భంగా ఆయన ధన్య వాదాలు చెపుతూ….ప్రతిపక్ష సభ్యులు సభకు రాకపోవడం బాధాకరంగా ఉందని కోడెల వ్యాఖ్యానించారు.   “సభా స్పీకర్ అంటే ఉగాది పచ్చడి లాంటి ఉద్యోగం, ఎమ్మెల్యే కిడారి హత్య ఎంతో బాధించింది, మహిళా పార్లమెంట్ వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించామమని”  కోడెల చెప్పారు. సభ్యులపై అనర్హత విషయం లో అనేక ప్రశ్నలు వచ్చాయి. సభ్యులందరు గెలిచి మళ్ళీ సభకు రావాలని కోరుతున్నా అని స్పీకర్ ఆశించారు. ప్రజలకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు సభ తీసుకుందని, ప్రజల్లో సభ జరిగిన తీరుపై ప్రశంసలు ఉన్నాయని చెపుతూ మళ్ళీ చంద్రబాబు సీఎం గా రావాలని ఆకాంక్షిస్తున్నానని కోడెల అన్నారు.