Delhi Liquor Scam : ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను దెబ్బకొట్టేందుకు కుట్ర- ఈడీపై ఆప్ ఫైర్

ఈడీ.. బిజెపి పొలిటికల్ వింగ్ లా పనిచేస్తోంది. ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తుంది.

Delhi Liquor Scam : ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను దెబ్బకొట్టేందుకు కుట్ర- ఈడీపై ఆప్ ఫైర్

AAP On ED Allegations

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ చేసిన ప్రకటనను ఆప్ తీవ్రంగా ఖండించింది. 100 కోట్ల ముడుపులు అని చెప్పి ప్రచారం చేస్తున్న ఈడీ.. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా పట్టుకోలేకపోయిందని మండిపడింది. లోక్ సభ ఎన్నికల ముందు ఆప్ పార్టీని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం, ఈడీ కుట్ర పన్నిందని ఆప్ నేతలు ఆరోపించారు. లిక్కర్ కేసులో సాక్ష్యాలు దొరక్క ఈడీ విసుగెత్తిపోయిందని ఆప్ చెబుతోంది.

”100 కోట్ల ముడుపులు అని ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదు. లోక్ సభ ఎన్నికల ముందు మా పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఈడీ ఆరోపణలు చేస్తుంది. ఈడీ.. బిజెపి పొలిటికల్ వింగ్ లా పనిచేస్తోంది. ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తుంది. ఈ కేసులో 500లకు పైగా సోదాలు జరిపినా.. వేల మంది సాక్ష్యులను విచారించినా దర్యాప్తు సంస్థకు అక్రమంగా ఉన్నట్లు నిరూపించేలా ఒక్క రూపాయి కూడా లభించలేదు. చిన్న సాక్ష్యాన్ని కూడా రికవరీ చేయలేదు. లిక్కర్ కేసు దర్యాప్తుపై ఆధారాలు దొరక్క విసుగెత్తిపోయి ఈడీ తప్పుడు ఆరోపణలు చేస్తోంది. ఈడీ ప్రకటనలో ఒక్క కొత్త విషయం లేదు. 100 కోట్ల ముడుపులకు ఎటువంటి ఆధారాలు లేవు” అని ఆప్ మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.

2021-22 ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పన, అమలు ద్వారా ప్రయోజనాలు పొందడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తదితరులు కుట్ర పన్నారని తమ ప్రకటనలో వెల్లడించింది ఈడీ. ఈ ప్రయోజనాలకు ప్రతిఫలంగా ఆ పార్టీ నేతలకు రూ.100 కోట్లు చెల్లించడంలో కవిత భాగస్వామి అయ్యారని పేర్కొంది ఈడీ.

Also Read : కోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఊరట.. ఆ అభ్యర్థనకు ఆమోదం