చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ఫొటోలు దిగడానికే..

చంద్రబాబు ఢిల్లీ వెళ్లింది ఫొటోలు దిగడానికే..

Updated On : February 10, 2019 / 8:06 AM IST

గుంటూరు బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీ సీఎం చంద్రబాబుకు ఏకి పారేశారు. కుటుంబ పాలన వద్దని సొంతగా పార్టీ పెట్టిన ఎన్టీఆర్ ఆశయాలను లెక్కచేయట్లేదంటూ దుమ్మెత్తిపోశారు. ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తానని లోకేశ్‌‌ను వృద్ధి చేసుకుంటున్నారని ఆరోపించారు. ధర్మ పోరాట దీక్ష అని చెప్పి ఢిల్లీకి ఫొటోలు దిగడానికే వెళ్లారని విమర్శించారు. మోడీ తాను ఢిల్లీ వెళితే మళ్లీ అధికారంలోకే వెళ్తాననే గుర్తు చేశారు. 

 

  • ఫొటోలు దిగడానికే చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్తున్నారు. 
  • సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్న చంద్రబాబు తన కొడుకునే రైజ్ చేసుకుంటున్నారు.  
  • చంద్రబాబుకు వరుసగా గెలిచిన చరిత్ర ఎప్పుడు లేదు. ఈ సారి ఆయనకు ఓటమి భయం పట్టుకుంది.  
  • లోకేశ్ రాజకీయ భవిష్యత్ కోసమే కొత్త కూటమితో జతకట్టారు. 
  • కేంద్రం నుంచి ఇచ్చిన నిధులకు లెక్కలు అడిగితే చంద్రబాబు పారిపోతున్నారు. 
  • ఈ సభకు ఖర్చు అంతా బీజేపీయే పెట్టుకుంది. ఇదే సభలో ఓ వైపు ప్రభుత్వ కార్యక్రమాలను కూడా ప్రారంభించాను. 
  • ఢిల్లీలో ఆందోళనకు చేస్తున్న ఖర్చును టీడీపీ పార్టీ నుంచి పెడుతున్నారా..? ప్రభుత్వ ఖజానా నుంచి పెడుతున్నారా..?
  • ఖర్చుల వివరాలపై ఏజీ ప్రజలకైనా సమాధానాలు చెప్పండి. 
  • గో బ్యాక్ అంటోన్న టీడీపీకి ధన్యవాదాలు.
  • నేను మళ్లీ ఢిల్లీ వెళ్లి అధికారం అందుకోబోతున్నాను. 

ధర్మ పోరాట దీక్షకు చంద్రబాబు పెడుతున్న ఖర్చుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారా లేదా అనే విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. ఢిల్లీకి ఫొటోలు దిగడానికే వెళ్తున్నారని తాను ఢిల్లీ వెళ్తే మళ్లీ అధికారంలో ఉంటానని బాబుకు గుర్తు చేశారు.