14న టీడీపీ ఫస్ట్ లిస్ట్ : ఒంగోలు లోక్ సభకు శిద్దా పేరు

  • Published By: veegamteam ,Published On : March 12, 2019 / 06:51 AM IST
14న టీడీపీ ఫస్ట్ లిస్ట్ : ఒంగోలు లోక్ సభకు శిద్దా పేరు

Updated On : March 12, 2019 / 6:51 AM IST

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు మొదటి జాబితాను సిద్ధం చేశారు. పెండింగ్ లిస్ట్ ను క్లియర్ చేసే పనిలో బాబు కసరత్తులు పూర్తయినట్లుగా తెలుస్తోంది. మార్చి 14న మొదటి బాబితాలో అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఒంగోలు లోక్ సభకు మంత్రి శిద్దా రాఘవరావు పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి పరిస్థితుల్లో ఆయన అయితే బెటర్ అంటున్నారు చంద్రబాబు. చంద్రబాబు ఆలోచనను మంత్రి శిద్దా వ్యతిరేకిస్తున్నారు. లోక్ సభ బరిలోకి దిగను అంటున్నారు. అసెంబ్లీకే పోటీ చేస్తా అంటున్నారు శిద్దా. 
 

ఏపీలో అసెంబ్లీ..లోక్ సభ ఎన్నికల యుద్ధానికి పార్టీలన్ని రెఢీ అయిపోయారు. ఎన్నికల సమయం దగ్గర పడతున్న కొద్దీ ఆయా పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల బాబితాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో 20 నియోజక వర్గాల లోక్ సభకు సంబంధించి  నేతలతో చంద్రబాబు లిస్ట్ రెడీ చేశారు.

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ స్థానానికి కదిరి బాబూరావు, సూళ్లూరు పేట నుంచి నెలవల బాల సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ పనబాక కృష్ణయ్య, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పీతల సుజాత, కృష్ణా తిరువూరు బరిలో మంత్రి జవహర్ ను బరిలోకి దించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో టీడీపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఎవరికి ఇష్టమైన స్థానంలో వారు టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.