Bihar: చిన్నవాడైనా చాలా గౌరవించాను, కానీ.. పీకే వ్యాఖ్యలపై మండిపడ్డ నితీశ్
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్‌ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసులో చాలా చిన్నవాడు. కానీ నేను అతడిని చాలా గౌరవించాను. కానీ అతడు నన్ను చాలా అగౌరవ పరిచాడు’’ అని విమర్శించారు

He speaks for his own publicity says nitish no pk comments
Bihar: సమయం దొరికినప్పుడల్లా బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై విరుచుకు పడుతూనే ఉన్నారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. తాజాగా ఆయన మరోసారి నితీశ్‌పై విమర్శలు గుప్పించారు. ఓ సందర్భంగా పీకే మాట్లాడుతూ నితీశ్ కుమార్ మళ్లీ బీజేపీతో చేతులు కలుపుతారని అన్నారు. ఈ విషయమై నితీశ్ స్పందిస్తూ ఇదంతా పబ్లిసిటీ కోసం పీకే వేస్తున్న స్టంట్లని, వాటన్నిటినీ పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. వయసులో చిన్నవాడైనా పీకే తాను ఎంతగానో గౌరవం ఇచ్చానని, అయితే అతను మాత్రం అది కాపాడుకోలేకపోయాడని నితీశ్ అన్నారు.
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్‌ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసులో చాలా చిన్నవాడు. కానీ నేను అతడిని చాలా గౌరవించాను. కానీ అతడు నన్ను చాలా అగౌరవ పరిచాడు’’ అని విమర్శించారు. ఇక దీనికి ముందు ప్రశాంత్ కిశోర్ మాట్లాడుతూ ‘‘బీజేపీతో నితీశ్ తెగతెంపులు చేసుకోలేదనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జేడీయూ నేత హరివంశ్ ఇంకా రాజ్యసభ డిప్యూటీ చైర్మెన్‌గానే ఉన్నారు. ఒకవేళ బీజేపీ నుంచి తప్పుకోవాలని ఉంటే ఆయనను పదవి నుంచి రమ్మనే వారు. ఏమో.. బీజేపీతో నితీశ్ మళ్లీ జతకట్టే అవకాశాలు లేకపోలేదు’’ అని అన్నారు.
Pakistan: మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అనర్హుడిగా ప్రకటించిన ఎన్నికల సంఘం