కరీంనగర్‌లో హై అలర్ట్ : హైపోక్లోరిన్ స్ర్పే..ఇంటి నుంచి బయటకు రావొద్దు

కరీంనగర్ జిల్లాలో రెండో రోజు హై అలర్ట్ కొనసాగుతోంది. ఇండోనేషియా నుంచి వచ్చిన 11 మంది ఇస్లామిక్ మత ప్రచారకుల బృందంలో ఏడుగురికి కరోనా సోకడం జిల్లా వాసులను కలవర పాటుకు గురి చేసింది. వెంటనే వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి రక్తనమూనాలను ల్యాబ్‌కు పంపించారు. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది.
2020, మార్చి 20వ తేదీ శుక్రవారం 65 డివిజన్లలో ప్రత్యేక బృందాలు హైపోక్లోరిన్ స్ర్పే చేయనున్నాయి. దీంతో ఇంటి నుంచి ఎవరూ బయటకు రావొద్దని సూచిస్తున్నారు. అలాగే..ఇండోనేషియా వాసులు సంచరించిన ప్రాంతాలను వైద్య బృందాలు ఐడెంటీఫై చేస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారింట్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నాయి. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే..హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్వయంగా..మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నగర పాలక పరిధిలో ఉన్న వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్య సిబ్బంది క్లీనింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల 10tvతో మాట్లాడారు. నగరం పరిశుభ్రంగా ఉంచేందుకు..లిక్విడ్ క్లీనింగ్ చేయడం జరుగుతోందని, దీనివల్ల వైరస్ రాదని అభిప్రాయం ఉందన్నారు. ప్రతొక్కరూ వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు.
స్వీపింగ్, శానిటైషన్..నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామన్నారు. 20 వేల మందిని స్త్ర్కీనింగ్ చేయడం జరిగిందని, విదేశాల నుంచి వచ్చిన వారిలో లక్షణాలు కనిపించడంతో..వారిని ఇంటి వద్దే ఉండాలని సూచించడం జరిగిందన్నారు. 20-30 వేల మందిని స్త్ర్కీనింగ్ చేయడం జరుగుతోందన్నారు.
Read More : బిగ్ బ్రేకింగ్ : భారత్‌లో కరోనా..ఐదో మృతి