Karnataka Politics: కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొత్త కూటమి.. బీజేపీ-జేడీఎస్ పొత్తు?
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి

BJP and JDS: కర్ణాటకలో రాజకీయ చిత్రం పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు, నేడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ తర్వాత రాష్ట్రంలో ప్రధాన పార్టీగా చాలా కాలంగా మనుగడ సాగిస్తున్న పార్టీ జనతాదళ్ సెక్యూలర్(జేడీఎస్) 2018 ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపింది. అయితే ఏడాదిన్నరకు ఆ ప్రభుత్వం కూలిపోవడంతో పొత్తు తెగిపోయింది. ఇక కొద్ది రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో బీజేపీ, జేడీఎస్ పార్టీలు హస్తం పార్టీకి విపక్ష పార్టీలుగా మారాయి.
Amit Shah in South: అమిత్‌షా ఏమన్నారో విన్నారా.. సౌత్‌లో బీజేపీకి 80 ఎంపీ సీట్లు సాధ్యమేనా?
ఈ నేపథ్యంలోనే రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా రైల్వే ప్రమాదంపై విపక్షాలన్నీ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుంటే జేడీఎస్ చీఫ్ దేవెగౌడ మాత్రం రైల్వే మంత్రి ప్రశంసలు కురిపించారు. ఈ పరిణామమే పొత్తుకు సంబంధించిన ప్రశ్నలకు తావిస్తోంది. ఇక తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజు బొమ్మై ఇందుకు ఊతం ఇచ్చేలాగానే మాట్లాడారు. పొత్తు పెట్టుకుంటామని ఆయన చెప్పలేదు కానీ, ఇంకా అలాంటి చర్చలేమీ జరగలేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
Maharashtra Politics: ఫడ్నవీస్‌ను దాటి ఎదిగిన షిండే.. రాజకీయ దుమారం లేపిన మహా సీఎం పత్రికా ప్రకటన
జేడీఎస్ అవసరాన్ని బట్టి అటు కాంగ్రెస్ పార్టీతో ఇటు భారతీయ జనతా పార్టీతో పొత్తు ఏర్పరుచుకుంటోంది. ఇలాగే ఆ పార్టీ రెండు సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో త్రిముఖ పోటీ వల్ల జేడీఎస్ పార్టీకి ఇలాంటి అవకాశాలు కలిసి వస్తున్నాయి. ప్రస్తుతం జేడీఎస్ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నడూ లేనంతగా ఓట్లు, సీట్లు పడిపోయాయి. దీంతో తమ ఉనికిని చాటుకోవడానికి చేయి చాచక తప్పడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో బీజేపీ సైతం దారుణ పరాభవాన్ని మూటకట్టుకుంది. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలంటే జేడీఎస్ పార్టీని సైతం కలుపుకు పోవాలనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై తొందరలోనే క్లారిటీ వస్తుందని ఇరు పార్టీల వారు గుసగుసలాడుకుంటున్నారు.