బరిలోకి జనసేనాని : ఏలూరు నుంచి పవన్ పోటీ

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు పెద్దగా సమయం లేకపోవడంతో

  • Published By: veegamteam ,Published On : March 11, 2019 / 10:02 AM IST
బరిలోకి జనసేనాని : ఏలూరు నుంచి పవన్ పోటీ

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల దాఖలుకు పెద్దగా సమయం లేకపోవడంతో

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థుల ఎంపికపై ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారు. నామినేషన్ల  దాఖలుకు పెద్దగా సమయం లేకపోవడంతో వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మంగళవారం (మార్చి 12) 32  అసెంబ్లీ, 9 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

పవన్ పోటీ చేయబోయే అసెంబ్లీ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. అందరి దృష్టి పవన్ పోటీ చేసే స్థానంపైనే ఉంది. ఆయన ఎక్కడి నుంచి  బరిలోకి దిగుతారు అని ఆసక్తిగా చూస్తున్నారు. ఏలూరు, పిఠాపురం, గాజువాక నియోజకవర్గాల్లో ఏదో ఒక చోట నుంచి పవన్ కళ్యాణ్ పోటీ  చేయాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం నుంచి పవన్ బరిలోకి దిగొచ్చని తెలుస్తోంది.  తాను పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ ఇప్పటికే సర్వే చేయించుకున్నట్టు సమాచారం.

మంగళగిరిలో పార్టీ స్క్రీనింగ్, జనరల్ బాడీ కమిటీలతో పవన్ సమావేశం అయ్యారు. సోమవారం(మార్చి 11) ఉదయం నుంచి చర్చలు జరుపుతున్నారు. తొలి జాబితాను ఇవాళ(మార్చి 11) సాయంత్రం లేదా రేపు(మార్చి 12) ఉదయం రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తొలి జాబితాలో 32 అసెంబ్లీ స్థానాలకు, 9 లోక్ సభ నియోజకవర్గాలకు జనసేన అభ్యర్థులను ప్రకటించనున్నారు. ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు ఉంటుందని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. వామపక్షాలకు ఎన్ని సీట్లు కేటాయించాలి, ఏయే సీట్లు కేటాయించాలి అనే దానిపై వామపక్ష నేతలతో పవన్ సుదీర్ఘంగా చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి సీపీఎం మధు, సీపీఐ రామకృష్ణతో పవన్ చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు ధీటుగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పవన్ ఉన్నారు.

ఎక్కడైతే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో అక్కడి నుంచే తొలి విడతలో అభ్యర్థులను పవన్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో పీఆర్పీ గెలిచిన స్థానాలు, రెండో స్థానంలో వచ్చిన నియోజకవర్గాల్లో ముందుగా జనసేన అభ్యర్థులను పవన్ ప్రకటించే ఛాన్స్ ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.