Tariq Mansoor: ముస్లింలపై మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు.. బీజేపీ ఉపాధ్యక్షుడిగా అలీగఢ్ ముస్లిం యూనివర్సీ మాజీ వైస్ చాన్స్‌లర్ తారిఖ్ మన్సూర్
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటేనే ముస్లిం వ్యతరేకి అనే పేరు ఉంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటాయి. అంతే కాకుండా చాలాసార్లు ఎన్నికల్లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ముస్లింపై ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు

BJP Vice President: భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకవర్గంలో పలువురికి కొత్తగా పదవులు ఇచ్చారు. తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి జాతీయ కార్యదర్శిగా స్థానం కల్పించారు. ఇక తాజాగా అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ మాజీ మాజీ వైస్ చాన్స్‌లర్ తారిఖ్ మన్సూర్‌కు జాతీయ ఉపాధ్యక్షడుగా అవకాశం కల్పించడం చర్చనీయాంశమవుతోంది. కొత్తగా తీసుకున్న వారితో కలిపి 13 మంది ఉపాధ్యక్షులు, ఎనిమిది మంది జాతీయ కార్యదర్శులు అయ్యారు. కాగా, ఈ జాబితాలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీకి చోటు కల్పించారు. వీరితో పాటు, చాలా షాకింగ్ పేర్లు జాబితాలో ఉన్నాయి.
జేపీ నడ్డా తాజా టీంలో ఇద్దరు ముస్లింలు ఉన్నారు. వాస్తవానికి భారతీయ జనతా పార్టీ అంటేనే ముస్లిం వ్యతరేకి అనే పేరు ఉంది. దీనికి తగ్గట్టుగానే బీజేపీ నేతల వ్యాఖ్యలు ఉంటాయి. అంతే కాకుండా చాలాసార్లు ఎన్నికల్లో ఒక్క ముస్లిం వ్యక్తికి కూడా పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే కొద్ది రోజుల క్రితం ముస్లింపై ప్రధాని మోదీ షాకింగ్ కామెంట్స్ చేశారు. ముస్లింలలో వెనుకబడిన వర్గమైన పాస్మాండలు 80 శాతం ఉన్నారని, వారికి దగ్గరవ్వండని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ చెప్పారు. దీనికి అనుగుణంగానే బీజేపీ కొత్త కార్యకవర్గంలోకి ముస్లింలను తీసుకున్నట్లు చెబుతున్నారు.
ఇక మన్సూర్‌కు బీజేపీలో అత్యున్నత పదవి ఇవ్వడంపై విమర్శలు కూడా గట్టిగానే వస్తున్నాయి. సిటిజెన్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)కు వ్యతిరేంగా విద్యార్థులు (ఏఎంయూ) నిరసన చేస్తే వారిపై మన్సూర్ ఉక్కుపాదం మోపారనే విమర్శ ఉంది. అధికార పార్టీకి సన్నిహితంగా ఉండడం వల్లే ఇలా జరిగిందని బలమైన విమర్శలు ఉన్నాయి. ఇకపోతే, ముస్లింలను ఉపాధ్యక్ష పదవికి బీజేపీ ఎంపిక చేయడం పదేళ్లలో ఇది నాల్గవ సారి. కాగా, మోదీ వ్యాఖ్యల అనంతరం దళిత ముస్లింలు, వెనుకబడిన ముస్లింలు (పాస్మాండ ముస్లింలు) దగ్గరయ్యేందుకు బీజేపీ చాలా ప్రయత్నాలు చేస్తోంది.
Japan Minister In Delhi Metro : ఢిల్లీ మెట్రో ట్రైన్‌లో జపాన్ మంత్రి .. భారత్ తో బంధం బలమైనదన్న హయషి
తారిఖ్ మన్సూర్ ఉత్తరప్రదేశ్‌లోని అలీఘఢ్‌కు చెందినవారు. యూపీలో ముస్లింల జనాభా దాదాపు 19% ఉంటుంది. కనీసం 30 లోక్‌సభ స్థానాల్లో గణనీయమైన ఉనికి ఉంది. వీటిలో 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఫలితాలను నిర్ణయించడంలో వారు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆ లక్ష్యంగానే ముస్లింలను బీజేపీ ప్రోత్సహిస్తోందని అంటున్నారు.