KCR హామీలు : త్వరలో నిరుద్యోగ భృతి

  • Published By: madhu ,Published On : January 25, 2020 / 01:02 PM IST
KCR హామీలు : త్వరలో నిరుద్యోగ భృతి

Updated On : January 25, 2020 / 1:02 PM IST

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించారు. త్వరలోనే నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు. తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, తాము అధికారంలో ఐదేళ్లు ఉంటామని..నిరుద్యోగ భృతిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో TRS విజయదుందుభి సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఓటర్లకు కృతజ్ఞతలు తెలియచేశారు. గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ పలు అంశాలపై మాట్లాడారు. విపక్ష పార్టీలకు ప్రజలు చెంపదెబ్బ కొట్టారని, ఇప్పటికైనా మారాలని సూచించారు. ఈ సందర్భంగా తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. వీటిని త్వరలోనే  పూర్తి చేస్తామని మరోసారి హామీనిచ్చారు. 

హామీలు : –
* 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్. నిధులు పొందుపరిచి మార్చి 31 తర్వాత వృద్ధాప్య ఫించన్లు (రూ. 2, 116) ఇస్తాం. 
* తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితిని త్వరలోనే పెంపు.
* పీఆర్సీ ఎంత పెంచాలనే దానిపై త్వరలో నిర్ణయం. 

* తెలంగాణ హెల్త్ ప్రోఫెల్ కోసం కార్యాచరణ. 
* ఎన్ఆర్ఐసీ పాలసీ, నిరక్షరాస్యత రూపు మాపడానికి కృషి. 
* తర్వలో న్యూ రెవెన్యూ యాక్టు. 

* కొత్త మున్సిపల్ చట్టం, పంచాయతీ రాజ్ చట్టాన్ని పక్కాగా అమలు చేస్తాం. 
* రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికలు ఏర్పాటు. రైతు సమన్వయ సమితి అద్బుతంగా మలుస్తాం. రైతుల డామినేషన్ చూస్తారు. 
* ఐకేపీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్‌‌లను చిన్నదిగా ప్రారంభిస్తాం. 

* కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కోటి ఎకరాలకు నీరందించేందుకు మరింత కృషి. 
* నిరుద్యోగ భృతి : ఎవరు నిరుద్యోగ భృతి తేల్చాలి..ఆర్థిక మాంద్యం తీవ్రంగా ఉండె. దీనిపై త్వరలో చూస్తాం. దీనిని కూడా చేస్తాం. 
 

కేసీఆర్ స్పీచ్ హైలెట్స్ : – 
* CAA కేంద్రం తీసుకున్న తప్పుడు నిర్ణయం. 
* సీఏఏకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రులతో త్వరలో సమావేశం. 
* సీఏఏను వ్యతిరేకిస్తూ త్వరలో తీర్మానం. 

* సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు చేస్తే కఠిన చర్యలు. 
* అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు. 
* ఆరేళ్ల టీఆర్ఎస్ పాలనకు ప్రజలు మంచి మార్కులిచ్చారు. 

* ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్లు ఏర్పాటు. 
* త్వరలో కొత్త రెవెన్యూ చట్టం. 
* రెవెన్యూ ఉద్యోగులను పిలిచి మాట్లాడుతాం.

* పని చేస్తే..ఒకే..లేకపోతే..వేరే శాఖకు పంపిస్తాం. 
* మున్సిపల్, గ్రామ పంచాయతీ టాక్స్‌లపై సమీక్ష చేయాల్సి ఉంది. 

* ఏదీ పెంచినా..మార్చి 31 తర్వాతే..పెంచుతాం. 
* ప్రజలకు చెప్పి..సమంజసంగా పన్నులు పెంచుతాం. 
* నిరుపేదలకు మాత్రం పన్నులు పెంచం. 

Read More :కేంద్రం సరిగ్గా పని చేస్తలే.. డబ్బులిస్తలే : సీఎం కేసీఆర్