ఆర్టీసీ సమ్మె : మహిళా కండక్టర్ ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : October 28, 2019 / 08:57 AM IST
ఆర్టీసీ సమ్మె : మహిళా కండక్టర్ ఆత్మహత్య

Updated On : October 28, 2019 / 8:57 AM IST

ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ నీరజ ఆతహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమ్మె చేస్తున్న కార్మికులను ఉద్యోగాల నుంచి తొలిగించారన్న మనస్తాపంతో నీరజ బలవన్మరణానికి పాల్పడ్డారని తెలుస్తోంది.  విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నీరజ ఆత్మహత్యను నిరసిస్తూ…ఆర్టీసీ కార్మికులను ఆందోళనకు దిగారు. 

ఖమ్మం ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎలాంటి సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆందోళన చేస్తున్న కార్మికులను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మహిళా కండక్టర్‌ నీరజ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరో వైపు ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 24వ రోజుకు చేరుకుంది. దశల వారీగా కార్మికులు ఆందోళన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్టోబర్ 28వ తేదీ సోమవారం కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు ఆర్టీసీ కార్మికులు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అన్ని డిపోల కార్మికులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఆర్టీసీ వివాదంపై కాసేపట్లో కోర్టులో వాదనలు ప్రారంభం కానున్నాయి.  ఆర్టీసీపై దాఖలైన మూడు పిటిషన్లను హైకోర్టు విచారించనుంది. ఆర్టీసీ సమ్మె, అద్దె బస్సుల నోటిఫికేషన్ ఆర్టీసీ కార్మికుల జీత భత్యాల చెల్లింపుల దాఖలైన పిటీషన్‌పై విచారణ చేపట్టనుంది. ఇరువర్గాలు హైకోర్టుకు ఏం చెప్పబోతున్నారు. ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు? వారి వాదనలను విన్నాక న్యాయస్థానం ఎలా రెస్పాండ్ అవుతుందన్నది ఇపుడు ఉత్కంఠ రేపుతోంది.
Read More :