Opposition Meet: లాలూ ప్రసాద్ యాదవ్ కాళ్లు మొక్కిన మమతా బెనర్జీ

మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

Opposition Meet: లాలూ ప్రసాద్ యాదవ్ కాళ్లు మొక్కిన మమతా బెనర్జీ

Updated On : June 22, 2023 / 7:41 PM IST

Mamata touches Lalu feet: విపక్షాల సమావేశానికి హాజరయ్యేందుకు ఒకరోజు ముందుగానే పాట్నాకు వచ్చిన పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ.. గురువారం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతా దళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‭ను కలుసుకున్నారు. ఇంట్లోకి వెళ్లగానే లాలూ ప్రసాద్ కాళ్లు మొక్కారు మమతా. లాలూ అంటే తనకు ప్రత్యేకమైన గౌరవమని, ఆయనను కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని మమతా బెనర్జీ అన్నారు. తామంతా కుటుంబ సభ్యుల్లాగే ఉంటామని, విపక్షాల ఐక్యతలో కూడా అలాగే కలిసి ఉంటామని మమత అన్నారు.

Opposition Meet: విపక్షాల మీటింగుపై బీఎస్పీ చీఫ్ మాయావతి కీలక వ్యాఖ్యలు

ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ‘‘లాలూ ప్రసాద్ అంటే నాకు ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. చాలా రోజుల తర్వాత ఆయనను కలుసుకున్నాను. చాలా ఆనందంగా ఉంది. ఆయన ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా, ధృఢంగా ఉన్నారు. బీజేపీపై ఆయన పోరాటం చేయగలరు. మేమంతా ఒక కుటుంబం. కుటుంబంలాగే కలిసి పోరాడుతాం’’ అని మమత అన్నారు.

Opposition Meet: ఒక్క సీటు కూడా లేదు, బీజేపీని ఛాలెంజ్ చేస్తున్నారు.. తేజశ్వీపై సుశీల్ మోదీ సెటైర్లు

పాట్నాకు చేరుకున్న అనంతరమే.. మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ శుక్రవారం జరగనున్న సమావేశంలో నిర్మాణాత్మ నిర్ణయాలు తీసుకుంటామని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ చెప్పారు. విపత్తు నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాల్సిందేనని అన్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓట్లు వేస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‭కు షాక్.. మళ్లీ జైలు తప్పేలా లేదు

మణిపూర్ లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై మమతా బెనర్జీ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని చాలా ఆలస్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. మణిపూర్ లో హింసపై కేంద్ర మంత్రి అమిత్ షా జూన్ 24న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు.