మోడీ,షా,యోగి కొత్త హెయిర్ స్టైల్ చూశారా!

ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హబీబ్ చేరిన వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా,యూపీ సీఎం యోగి ఆదిత్యనాధ్,తదితర బీజేపీ నాయకుల హేర్ స్టైల్స్ సడన్ గా మారిపోయాయి. ప్రధాని మోడీ తలతలలాడుతున్న తన తెల్లటి జుట్టుకు జెల్ పూసి పాప్ సింగర్‌లా వెనక్కి దువ్వుకోగా, అమిత్ షా కూడా జెల్ పూసుకొని హాలీవుడ్ స్టార్ లాగా కాస్తా పక్కకు నిక్కపొడుచుకున్నట్లు దువ్వారు.
మీకంటే మేమేం తక్కువ, కుర్రాళ్లం! అనుకున్నారేమో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌లు పోటీ పడి మరీ తమ హేర్ స్టైల్స్ మార్చుకున్నారు. వారు మార్చుకోలేదు. నెటిజెన్లు మార్చారు.దేశవ్యాప్తంగా 110 నగరాల్లో 846 హేర్, బ్యూటీ సెలూన్లు కలిగిన ప్రముఖ హేర్ స్టైలిస్ట్ జావెద్ హబీబ్ బీజేపీలో చేరారనే వార్త తెలియగానే ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతల ఫొటోలను తీసుకొని మార్ఫింగ్ ద్వారా వారి హేర్ స్టైల్స్‌ను మార్చి వేశారు. అంతటి ప్రముఖుడు పార్టీలో చేరినప్పుడు నేతల జుట్టు స్టైల్స్ మారాల్సిందేగదా! అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఇప్పుడు బీజేపీ నేతల హెయిల్ స్టైల్స్ కి సంబంధించిన మార్ఫింగ్ ఫొటోలు వైరల్ గా మారాయి.