CAA వ్యతిరేకులను బ్రేకుల్లేని బస్సులో పాక్‌కు పంపిస్తాం – బండి సంజయ్

హన్మకొండలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. CAAని వ్యతిరేకించే వారిని బ్రేకుల్లోని బస్సుల్లో పాకిస్తాన్‌కు పంపిస్తామని హాట్ హాట్ కామెంట్స్ చేశారాయన. దేశంలో విచ్చిన్నం సృష్టించాలని కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాళ్లు పట్టుకొని వస్తే..తాము బాంబులు పట్టుకుని వస్తామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారాయన. 2020, జనవరి 08వ తేదీ హన్మకొండలో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ…పచ్చజెండాలతో ర్యాలీ తీసి ఓరుగల్లు గడ్డను అపవిత్రం చేశారని MIM నేతలపై మండిపడ్డారు. ఈ గడ్డను పవిత్రం చేయడానికే తాము కాషాయ జెండా పట్టుకుని ర్యాలీ చేశామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో TRSకు ఓటు వేస్తే..MIMకు వేసినట్లేనన్నారు. ఓవైసీ బ్రదర్స్, కేసీఆర్ కుటుంబం కుట్రలు తెలంగాణాలో సాగవన్నారు.
పౌరసత్వ సవరణ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)కి వ్యతిరేకంగా దేశంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. పలు రాష్ట్రాల్లో హింసాత్మకంగా మారాయి. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు సీఏఏను వ్యతిరేకించాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరిని కనబర్చలేదు. దీంతో MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ, మత పెద్దలు..సీఎం కేసీఆర్‌ను ఇటీవలే కలిశారు.
కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నట్లు ఓవైసీ వెల్లడించారు. ఏపీ సీఎం జగన్‌కు కూడా ఓవైసీ ఈ విషయంలో స్పందించాలని కోరారు. ఓ సభలో పాల్గొన్న సీఎం జగన్..CAAకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వలేమని తేల్చిచెప్పారు. తాజాగా ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్‌తో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.
Read More : రాజధాని చిచ్చు : బాబు దమ్ము, ధైర్యం ఉందా..రోడ్డుపైకి రా – పిన్నెల్లి