ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం : ఎంపీ విజయసాయిరెడ్డి

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదన్నారు.

  • Published By: veegamteam ,Published On : December 28, 2019 / 07:03 AM IST
ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధం : ఎంపీ విజయసాయిరెడ్డి

Updated On : December 28, 2019 / 7:03 AM IST

విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదన్నారు.

అమరావతిలో టీడీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే..మరోవైపు విశాఖలో వైసీపీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని టీడీపీ నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ విజయసాయిరెడ్డి ఖండించారు. మేం ఎలాంటి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదన్నారు. ఈ మేరకు శనివారం (డిసెంబర్ 28, 2019) ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సీబీఐ కాదు.. ఎఫ్‌బిఐ విచారణకైనా సిద్ధమన్నారు. 

చంద్రబాబు కుటిల మనస్తత్వమంటూ విమర్శలు గుప్పించారు. తన కుటుంబం మాత్రమే బాగుండాలనుకునే వ్యక్తి చంద్రబాబు అంటూ ధ్వజమెత్తారు. మొత్తం నెగెటివ్ ఆటమ్స్ తో పుట్టిన దుర్మార్గపు వ్యక్తి చంద్రబాబు ఘాటుగా విమర్శించారు. కుటిల పథకాలు, స్వార్థపూరిత రాజకీయాలు, ఇన్ సైడర్ ట్రేడింగ్.. చంద్రబాబు వల్లనే అవుతాయని..మరెవరి వల్ల సాధ్యం కాదన్నారు. అమరావతిలో విపరీతంగా భూములు కొని, ధనార్జనే ధ్వేయంగా చంద్రబాబు భావించారని అన్నారు. 

అమరావతిలో బాబు అండ్ గ్యాంగ్ కమీషన్‌ వ్యాపారం చేసిందని ఆరోపించారు. టీడీపీ అమరావతిలో ఫండింగ్‌ ఉద్యమాలు నడుపుతోందని విమర్శించారు. అమరావతి మాత్రమే అభివృద్ధి అవ్వాలనుకోవడం తప్పన్నారు. విశాఖలో ఏ ఒక్కరు కూడా ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడలేదన్నారు. ఏపీ అభివృద్ధి కోసం జగన్‌ ఓ విజన్‌తో ముందుకెళ్తున్నారని తెలిపారు.