Munugode bypoll: నామినేషన్‌ దాఖలు చేసిన కూసుకుంట్ల.. ర్యాలీలో బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం

తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీఆర్ఎస్, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ... కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు.

Munugode bypoll: నామినేషన్‌ దాఖలు చేసిన కూసుకుంట్ల.. ర్యాలీలో బీజేపీపై కేటీఆర్ ఆగ్రహం

Munugode bypoll

Updated On : October 13, 2022 / 5:14 PM IST

Munugode bypoll: తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కేటీఆర్‌, టీఆర్ఎస్, వామపక్ష నేతలు పలువురు పాల్గొన్నారు. ర్యాలీలో కేటీఆర్ మాట్లాడుతూ… కూసుకుంట్లను గెలిపిస్తే మునుగోడు నియోజక వర్గాన్ని దత్తత తీసుకుంటానని చెప్పారు.

మోదీ చేసిన అన్యాయానికి, ప్రజల ఆత్మగౌరవానికి మధ్య మునుగోడులో ఎన్నిక జరుగుతుందని కేటీఆర్ అన్నారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు మోదీ ఇచ్చారని రాజగోపాల్ చెప్పారని ఆరోపించారు. రాజగోపాల్‌రెడ్డి మునుగోడు అభివృద్ధి గురించి ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఓటుకు రూ.వేలు ఇస్తామన్న అహంకారంతో రాజగోపాల్ విర్రవీగుతున్నారని చెప్పారు.

దేశంలోని ప్రతి పౌరుడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షలు వేస్తానని, 2014 ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు. ఎవరికైనా రూ.15లక్షలు వస్తేనే వారు బీజేపీ ఓటు వేయాలని అన్నారు. కేసీఆర్ చేనేత మిత్ర పేరుతో రాయితీలు ఇస్తున్నారని చెప్పారు. కృష్ణా జలాల్లో వాటాను తేల్చకుండా కేంద్ర ప్రభుత్వం మన్లని ఇబ్బంది పెడుతోందని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..