Munugode bypoll : కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు

కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. ఎవరిని గెలిపించాలో మునుగోడు ఓటర్లు డిసైడ్ అయిపోయారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.

Munugode bypoll :  కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు

Munugode bypoll 

Updated On : August 20, 2022 / 1:12 PM IST

Munugode bypoll  : మునుగోడులో గెలపు కోసం పార్టీలు దేనికైనా సిద్ధపడటానికి సిద్ధమయ్యాయి. ఒకప్పుడు ఓటర్ల ఇంటికెళ్లి దండంపెట్టి ఓట్లు అడిగేవారు. కానీ ఇప్పుడు గెలుపు కోసం దండం పెట్టటమే కాదు కాళ్లు పట్టుకుని ఓట్లు అడుక్కోవటానికి కూడా సిద్ధపడిపోతున్నారు. ఏంటీ జోక్ కాదు నిజ్జంగా నిజమే. మునుగోడులో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను ఆకట్టుకోవటానికి దేనికైనా సిద్ధపడిపోతున్నారు. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏకంగా ‘ఓటర్ల కాళ్లు మొక్కుడు’ కార్యక్రమానికి ప్లాన్ చేసింది. ఈ కాళ్లు మొక్కే సెంటిమెంట్ తో అయినా గెలవాలని భావిస్తోంది.

దీంట్లో భాగంగా సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ మునుగోడులో సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించే యోచనలో ఉంది. కాళ్లు మొక్కుతా.. కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని అడగబోతున్నట్లుగా తెలుస్తోంది. నియోజకవర్గంలో లక్ష మందికి కాళ్లు మొక్కి ఓటు అడిగేలా ప్రణాళిక రచిస్తోంది. ప్రతీ గ్రామానికి ఐదుగురు చొప్పున ప్రచార బాధ్యతలు అప్పగించనున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఓటర్ కాళ్లు మొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో కాంగ్రెస్ కాళ్లు మొక్కే కార్యక్రమంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. మునుగోడులో ఓటర్లను కాంగ్రెస్ కాళ్లు మొక్కుడే కాదు పొర్లు దండాలు పెట్టినా కాంగ్రెస్ గెలుపొందే ప్రసక్తే లేదని..బీజేపీకే పట్టం కట్టాలని ఓట్లర్లు డిజైడ్ అయిపోయారు అంటూ బండి సంజయ్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలకు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకోవటానికి టైమ్ సరిపోవటం లేదు..ఇక మునుగోడులో ఏం గెలుస్తారు? అంటూ ఎద్దేవా చేశారు.అలాగే పనిలో పనిగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కూడా విరుచుకుపడ్డారు. మునుగోడులో గెలవటానికి ఓటర్లకు తాయిలాలు పంచటానికి విచ్చలవిడిగా డబ్బులు పంచటానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని..బీజేపీ గెలుపు ఖాయం అనే నమ్మకానికి వచ్చిన కేసీఆర్ దేనికైనా సిద్దపడుతున్నారంటూ ఆరోపించారు.

కాగా తెలంగాణలో ఎక్కడ విన్నా మునుగోడు..మునుగోడు..మునుగోడు ఇదే మాట వినిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో త్వరలో ఉప ఎన్నిక జరగనుండటంతో తెలంగాణలో  ఇదే హాట్ టాపిక్ గా మారింది. అన్ని పార్టీల నేతలు మునుగోడు చుట్టేస్తున్నారు. జాతీయపార్టీల అగ్రేనేతలు సైతం మునుగోడుకు కదిలి వస్తున్నారు. సీఎం కేసీఆర్ బహిరంగ సభ శనివారం (20,2022) ఉండగా… కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సభ ఆదివారం బీజేపీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. అటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి శనివారం నుంచి మునుగోడులో పాదయాత్ర చేస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్ర నేతల పర్యటనలతో మునుగోడు రాజకీయం హీటెక్కింది.