టీడీపీకి షాక్ : ఖ‌మ్మం నుంచి నామాకు కాంగ్రెస్ టికెట్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.

  • Published By: vamsi ,Published On : March 12, 2019 / 08:36 AM IST
టీడీపీకి షాక్ : ఖ‌మ్మం నుంచి నామాకు కాంగ్రెస్ టికెట్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది. ఇందుకు సంబంధించి అభ్యర్ధులను కూడా ఖరారు చేసుకుంటున్న కాంగ్రెస్ కసరత్తును దాదాపు పూర్తి చేసింది. ఈ క్రమంలో గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని భావిస్తున్న ఖమ్మం సీటును కాంగ్రెస్ నామా నాగేశ్వరరావుకు కేటాయించినట్లు తెలుస్తుంది.  గతంలో టీడీపీ తరపున ఖమ్మం ఎంపీగా గెలిచిన నామా నాగేశ్వరరావుకు ఇప్పుడు టిక్కెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే నామాకు టీడీపీ తరుపున కాంగ్రెస్ సీటు ఇస్తుందా? లేకుంటే కాంగ్రెస్‌లో చేర్చుకుని సీటు ఇస్తుందా? అనేదానిపై స్పష్టత రాలేదు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన నామా నాగేశ్వరరావుకు ఈ సీటు ఇచ్చి మిగిలిన చోట్ల టీడీపీ మద్దతు తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తుందా? అనేదానిపై క్లారిటీ రాలేదు. కాంగ్రెస్‌లో చేరి కాంగ్రెస్ గుర్తుపై నామా పోటీ చేస్తారా? లేకుంటే టీడీపీలో ఉండి కాంగ్రెస్ మద్దతుతో నామా పోటీ చేస్తారా? అనే విషయంపై మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. మొత్తానికి తెలంగాణలో తాము గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న ఖమ్మం నుంచి కాంగ్రెస్ నామాను బరిలోకి దింపడం ఇక్కడ చర్చకు తావిచ్చింది.