నా తెలుగు వల్ల ఏపీకి నష్టం జరిగిందా..? మా అమ్మ నన్ను వీధి రౌడీలా పెంచలేదు
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార పక్షం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార పక్షం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ అధికార పక్షం నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీలో తనను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నేతల విమర్శలను ఖండించిన లోకేష్.. వ్యక్తిగత దూషణలను తప్పుపట్టారు. నా తెలుగు కారణంగా ఏపీకి నష్టం జరిగిందా..? నా తెలుగు కారణంగా పోలవరం ఆగిపోయిందా..? అని అడిగారు. అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు తనను అవహేళన చేసినా, అవమానించినా.. స్పీకర్ ఏమీ అనకపోవడం బాధాకరం అన్నారు. మా అమ్మ నన్ను మీలా వీధి రౌడీలా పెంచలేదు, క్రమశిక్షణతో పెంచింది అని లోకేష్ చెప్పారు. బుధవారం(డిసెంబర్ 11,2019) ఉదయం లోకేష్ మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వం, వైసీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు.
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదు:
మంగళగిరి పులివెందుల కాదు, టీడీపీ కంచుకోట కాదు అని లోకేష్ అన్నారు. మంగళగరిలో టీడీపీ జెండా పాతేందుకే పోటీ చేశానని వివరించారు. మంగళగిరి నియోజకవర్గంలో 1985 తర్వాత టీడీపీ జెండా ఎగురలేదనే విషయాన్ని లోకేష్ గుర్తు చేశారు. చరిత్ర తిరిగి రాద్దామనే లక్ష్యంతో పోటీ చేశాను..కానీ ఓడిపోయాను అని తెలిపారు. ఓడినంత మాత్రాన మంగళగిరి నియోజకవర్గానికి వెళ్లకుండా ఉండటం లేదన్నారు. వారానికి ఒక రోజు జగన్ కోర్టుకి వెళ్లాలన్నారు. నాపై ఏనాడూ ఒక్క ఆరోపణ రాలేదన్నారు. నేను ఏ తప్పు చేయకపోయినా ఆరోపణలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు అని వాపోయారు. తాను చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బ్యాచ్ కాదన్నారు లోకేష్.
హెరిటేజ్ ఫ్రెష్ ఎప్పుడో అమ్మేశాం:
ఉల్లి ధరలకు, హెరిటేజ్ ఫ్రెష్ కి పోలిక పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు. హెరిటేజ్ ఫ్రెష్ తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. హెరిటేజ్ ను ఎప్పుడో అమ్మేశామని స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం హయాంలోనే ఏపీకి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు తీసుకొచ్చామని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న పార్టీ టీడీపీ అని చెప్పారు.
6 నెలల కాలంలో అన్ని ధరలు పెంచేశారు:
జగన్ ప్రభుత్వంపై లోకేష్ ఫైర్ అయ్యారు. ధరలు పెంచము అని చెప్పిన జగన్ మాట తప్పారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఆరు నెలల కాలంలో ఇసుక, ఉల్లి, లిక్కర్ ధరలు, ఆర్టీసీ చార్జీలు పెంచేశారని మండిపడ్డారు. 2012 నుంచి తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని లోకేష్ సీరియస్ అయ్యారు. గత ఐదేళ్లలో మేము చేసిన అభివృద్ధి వైసీపీకి కనిపించడం లేదా అని లోకేష్ అడిగారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఏపీకి 53 దేశ, అంతర్జాతీయ అవార్డులు సాధించామని చెప్పారు.
* జగన్ పాదయాత్రలో అన్నీ పెంచుతా అంటే ప్రజలు నమ్మారు
* ఇసుక, మద్యం ధరలు, ఆర్టీసీ చార్జీలు పెంచేశారు
* అర్థరాత్రి రహస్యంగా ఆర్టీసీ చార్జీలు పెంచారు
* నెల్లూరులో మాఫియా రాజ్యం వచ్చిందని వైసీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు
* రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ చేస్తే 6 నెలలైనా ఎందుకు నిరూపించలేకపోయారు
* అవినీతి, కేసులపై సీఎం జగన్ తో అయినా చర్చకు సిద్ధం
* 6నెలల్లో జగన్ ముంచే సీఎం అనిపించుకున్నారు
* మాకు సంస్కారం ఉంది కాబట్టే ఎక్కువగా మాట్లాడటం లేదు
* వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేశాం.. మాట్లాడేదేమీ లేదు