Nitin Gadkari: కాంగ్రెస్ పార్టీలో చేరికపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు
పాత విషయాన్నే గడ్కరి ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో ఒకసారి అన్నారు

Nitin Gadkari – Maharashtra Politics : కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కాంగ్రెస్ పార్టీలో చేరమని ఎవరో సలహా ఇచ్చారి. ఈ విషయమాన్ని రెండేళ్ల క్రితం వెల్లడించిన ఆయన.. తనకు వచ్చిన ప్రతిపాదనపై తన నిర్ణయాన్ని సైతం బహిరంగానే వెల్లడించారు. అయితే ఇదే విషయాన్ని ఆయనే తాజాగా మరోసారి ప్రస్తావించారు. తాను చావనైనా చస్తాను కానీ, కాంగ్రెస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేరేది లేదని ఆయన తేల్చి చెప్పారట. దీంతో ఆయనకు మళ్లీ అలాంటి సూచన రాలేదని స్వయంగా గడ్కరీనే వెల్లడించారు.
Actor Vijay: అంబేద్కర్, పెరియార్ వంటి నాయకులను వీలైనంత ఎక్కువ చదవండి.. విద్యార్థులతో దళపతి విజయ్
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లు పాలించింది. కాగా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తి కావస్తోంది. ఇక గతంలో కూడా 9 ఏళ్లు దేశాన్ని బీజేపీ పాలించింది. ఈ విషయాన్ని గడ్కరి ప్రస్తావించారు. గతంలో దేశాన్ని ఏలే పార్టీ కాంగ్రెస్ మాత్రమే అనుకునే వారని, కానీ తమ ప్రభుత్వం వరుసగా రెండుసార్లు అధికారం సాధించి 9 ఏళ్లు పూర్తి చేసుకుందని అన్నారు. మహారాష్ట్రలోని భండారాలో నరేంద్రమోదీ 9 ఏళ్ల పాలన పూర్తైన సందర్భంగా శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో గడ్కరీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
Sharad Pawar- KCR: మహారాష్ట్రలో దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కేసీఆర్‌పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
పాత విషయాన్నే గడ్కరీ ప్రస్తావించినప్పటికీ తనకు కాంగ్రెస్ పార్టీలో చేరమని సలహా ఇచ్చిన వ్యక్తి ఎవరో వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నేత శ్రీకాంత్ జిఖార్ (మరణించారు) తనకు ఈ సలహా ఇచ్చారట. ‘‘నేను చాలా మంచి నాయకుడిని, పార్టీ కార్యకర్తనని జిఖర్ నాతో ఒకసారి అన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరితే నాకు మంచి భవిష్యత్ ఉందని ఆయన సలహా ఇచ్చారు. కానీ నరకంలో దూకి చస్తాను కానీ కాంగ్రెస్ పార్టీలో చేరనని నేను ఆయనకు ఖరాఖండీగా ఒక మాట చెప్పాను. బీజేపీ బలమైన పార్టీ, ఆ పార్టీ సిద్ధాంతాలు కూడా బలమైనవి. నా నమ్మకం నిజమైంది’’ అని గడ్కరీ అన్నారు.