అలాంటి వ్యక్తులు నాకొద్దు- ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్యపై పవన్ కల్యాణ్ సెటైర్లు
నిన్నటివరకు తనకు కొందరు సలహాలు ఇచ్చారని, ఎలా నిలబడాలో, ఏం చేయాలో సూచించారని.. ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్.

Pawan Kalyan Key Comments On Harirama Jogaiah and Mudragada
Pawan Kalyan : ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కలిశారు. కిర్లంపూడిలోని ఆయన నివాసానికి వెళ్లిన మిథున్ రెడ్డి.. ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించారు. సీఎం జగన్ ఆదేశాలతోనే ముద్రగడను కలిశామన్నారు. మరోవైపు కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, హరిరామజోగయ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
నిన్నటివరకు తనకు కొందరు సలహాలు ఇచ్చారని, ఎలా నిలబడాలో, ఏం చేయాలో సూచించారని.. ఇప్పుడు వారంతా వైసీపీలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు పవన్ కల్యాణ్. తన వద్దే ఇలాంటి ఐడియాలు వస్తాయన్నారు.
”ఎన్ని సీట్లు ఇవ్వడం కూడా నాకు తెలియదా? రిజర్వేషన్ గురించి మాట్లాడినా, ఏం మాట్లాడినా.. పద్దతి ప్రకారం మాట్లాడాలి. పింక్ డైమండ్ లా.. టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరోలాగా మాట్లాడకండి. ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనెంట్ గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. స్టీల్ ప్లాంట్ విషయంలో నేను ఎప్పుడూ ఒకే మాట మీద ఉన్నా. ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నా నేనేం స్టీల్ ప్లాంట్ విషయంలో రాజీపడలేదు” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read : పొత్తు పొడిచేనా? టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై తెలకపల్లి రవి విశ్లేషణ