మోడీ, అమిత్ షా లే ఈ దేశానికి కరెక్ట్
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాంటి వారే ఈ దేశానికి కరెక్ట్ అన్నారు. అమిత్ షా లా ఉక్కుపాదంతో అణచివేసే వారికే వాళ్లు భయపడతారు అంటూ వైసీపీని ఉద్దేశించి పరోక్షంగా పవన్ అన్నారు. రాయలసీమను కొన్ని అరాచక గ్రూపులు కబ్జా చేశాయని ఆరోపించిన పవన్.. తాము కూడా సాధారణ మనుషులమే అనే విషయాన్ని మర్చిపోయారని అన్నారు. కులాన్ని, మతాన్ని ఇష్టానుసారంగా వాడుతున్నారని మండిపడ్డారు. ఇలాంటి వారికి అమిత్ షా లాంటి వారే సరిపోతారని చెప్పారు.
భవిష్యత్తు తరాల కోసమే తాను తపిస్తున్నానని పవన్ వెల్లడించారు. ఎదురు దెబ్బలు ఉంటాయని తెలిసే రాజకీయాల్లోకి వచ్చాను అన్నారు. ప్రజల కష్టాలు చూడలేక ఎంతో కష్ట సమయంలో పార్టీ పెట్టానని తెలిపారు. మార్పు కోసం జనసేన కంకణం కట్టుకుందన్నారు. తిరుపతిలో జనసేన కార్యకర్తలు, న్యాయవాదుల సమావేశంలో పవన్ ఈ కామెంట్స్ చేశారు. లాయర్లు కూడా రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
దేశం మీద ప్రేమతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని పవన్ తెలిపారు. ఒక మనిషి కష్టాల్లో ఉంటే తాను కళ్లుమూసుకుని ఉండలేనని అన్నారు. అన్నింటికీ తెగించే రాజకీయాల్లోకి వచ్చానని స్పష్టం చేశారు. తాను మాట్లాడుతుంటే.. తన తలకాయ ఎగిరిపోతుందని తెలిసినా మాట్లాడుతున్నానని చెప్పారు. జనసేనాని పవన్ తిరుపతిలో రెండో రోజు పర్యటించారు. మంగళవారం(డిసెంబర్ 3,2019) జనసేన పార్టీ కార్యకర్తలు, న్యాయవాదులతో ఆయన సమావేశమయ్యారు.