తగ్గేదేలే అంటున్న అన్నాచెల్లెలు.. సీఎం జగన్ వర్సెస్ వైఎస్ షర్మిల, ఏపీలో ఏం జరగనుంది?
సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురుదాడి చేస్తున్నారు.

AP CM Jagan Vs YS Sharmila
CM Jagan Vs YS Sharmila : ఏపీలో సీఎం జగన్, కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇద్దరూ సై అంటే సై అంటున్నారు. తగ్గేదేలే అన్నట్లు వాగ్బాణాలు సంధించుకుంటున్నారు. తన కుటుంబాన్ని కాంగ్రెస్ చీల్చిందని నిన్న తిరుపతిలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఎదురు దాడి చేశారు వైఎస్ షర్మిల. తప్పదంతా జగన్ అన్నదే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసిన షర్మిల.. తమ కుటుంబంలో విభేదాలకు జగనన్నే కారణం అని, ఇందుకు అమ్మ విజయమ్మ సాక్ష్యం అంటూ వివాదంలోకి తల్లిని కూడా లాగారు.
Also Read : వైఎస్ కుటుంబంలో రాజకీయ యుద్ధం.. షర్మిలతో జగన్‌కు చిక్కులు తప్పవా?
ఇక సీఎం జగన్ ను షర్మిల టార్గెట్ చేయడాన్ని వైసీపీ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. షర్మిలపై విమర్శలు ఎక్కుపెడుతూ చంద్రబాబుకు ప్రయోజనం కలిగించడానికే షర్మిల జగన్ పై విమర్శలు చేస్తున్నారని ఎదురు దాడి చేస్తున్నారు.
Also Read : టీడీపీ-జనసేన కూటమిలోకి కమలం పార్టీ! బీజేపీకి కేటాయించే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు ఇవే?