పుణ్యం ఊరికేపోదు : యాక్సిడెంట్ స్పాట్ లోనే బాధితులకు ఎంపీ వైద్యం

  • Published By: chvmurthy ,Published On : February 9, 2019 / 03:57 AM IST
పుణ్యం ఊరికేపోదు : యాక్సిడెంట్ స్పాట్ లోనే బాధితులకు ఎంపీ వైద్యం

Updated On : February 9, 2019 / 3:57 AM IST

ఆయనో ప్రజా ప్రతినిధి. పార్లమెంట్ సభ్యుడు. రోడ్డు మీద వెళ్తున్న సమయంలో ఓ ప్రమాదం చూశాడు. ఓ మహిళ గాయపడిన విషయాన్ని గమనించారు. వెంటనే కారు దిగి ప్రాథమిక చికిత్స అందించారు. ఆయన ఎవరో కాదు..  భువనగిరి ఎంపీ డాక్టర్‌ బూర నర్సయ్యగౌడ్‌. వివరాల్లోకి వెళితే  హైదరాబాద్ సిటీ మియాపూర్ కు చెందిన నాగమణి, వెంకటేశ్వర్లు, నాగరాజు కలసి టూవీలర్ పై వారి స్వగ్రామమైన ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం వెళ్తున్నారు. మధ్యంలో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాములు గ్రామం దగ్గర వారు ప్రయాణిస్తున్న బైక్ఎ ఎదురుగా ఉన్న వాహానాన్ని ఢీ కొట్టడంతో ముగ్గురు కింద పడిపోయారు.

ఆ సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్.. తన కారును ఆపి పరిస్ధితి గమనించారు. తీవ్రంగా గాయపడిన నాగమణికి వెంటనే ప్రాథమిక చికిత్స చేశారు. 108 అంబులెన్స్ ను పిలిపించి దగ్గరుండి ఆస్పత్రికి తరలించారు. రోడ్డుపై వెళుతుంటే ఏదైనా ప్రమాదం జరిగితే మన కెందుకులే అని పక్క నుంచి వెళ్లి పోయే మనుషుళ్ళన్న ఈ రోజుల్లో ఒక ప్రజాప్రతినిధి జరిగిన ప్రమాదానికి స్పందించి వెంటనే చికిత్స అందిచటంతో స్ధానికులు ఎంపీ పై ప్రశంసల జల్లు కురిపించారు.