Ap Bjp Candidates : 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధం- పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతాం. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది.

Ap Bjp Candidates : 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి బీజేపీ అభ్యర్థుల జాబితా సిద్ధం- పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Bjp

Ap Bjp Candidates : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాల్లో పోటీకి అభ్యర్థుల జాబితా సిద్దం చేశామని ఆమె తెలిపారు. అంతేకాదు.. ఈ రెండు రోజుల సమావేశాల్లో పొత్తులపై అభిప్రాయ సేకరణ జరగలేదన్నారు. విజయవాడలో రెండు రోజుల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించామని తెలిపారు. బీజేపీ జాతీయ నేత శివప్రకాశ్ ఆధ్వర్యంలో పార్టీ పరిస్థితిపై 26 జిల్లాల అధ్యక్షులు, ముఖ్య నేతలుతో చర్చించినట్ల వెల్లడిచారు. మ్యానిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలు తీసుకున్నామన్నారు.

”జేపీ నడ్డా, ప్రధాని మోడీ జన్మత్ రేఖను ప్రజల్లోకి తీసుకెళ్లమని చెప్పారు. ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించాం. సామాన్య ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటాం. 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లలో అభ్యర్థులపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. వీటిని మా జాతీయ నాయకత్వానికి వివరిస్తాం. మా అధిష్టానం నిర్ణయం బట్టి మా అడుగులు ఉంటాయి. పోటీ చేసే అభ్యర్థులు 2వేల మంది వరకు వచ్చారు. మా స్థాయిలో వాటిని క్రోడీకరించి ఒక్కో నియోజకవర్గంలో మూడు నుంచి ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. మా పార్లమెంటరీ కమిటీ సమీక్ష చేసి అభ్యర్థులను ఖరారు చేస్తారు. పొత్తు ఉంటే.. మా కేంద్ర పెద్దలే ప్రకటిస్తారు. ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి బెటర్ అనే దాని పైనే చర్చ సాగింది. మా జాబితా కేంద్రానికి రెండు రోజుల్లో పంపుతాం. ఆ తరువాత మా జాతీయ నాయకత్వం నిర్ణయం బట్టి కార్యాచరణ ఉంటుంది.

విజయవాడలో బీజేపీ జిల్లాల కన్వీనర్లు, ముఖ్య నేతలు, క్లస్టర్లతో ఆ పార్టీ జాతీయ సహ సంఘటన ప్రధాన కార్యదర్శి శివ్ ప్రకాశ్ ముఖాముఖి ముగిసింది. 26 జిల్లాల నేతల అభిప్రాయాలను రెండు రోజుల పాటు స్వీకరించారు. అభిప్రాయాలను బీజేపీ అధిష్టానానికి అందచేయనున్నారు శివ్ ప్రకాశ్.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?