టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మమ్మల్ని ఏమీ చేసేది లేదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉంది. అక్కడ తేల్చుకుందాం. ఇంతలో పనికిమాలిన ఛాలెంజ్ లు ఎందుకు..?

టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మమ్మల్ని ఏమీ చేసేది లేదు- సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy

Sajjala Ramakrishna Reddy : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు, మమ్మల్ని ఏమీ చేసేది లేదు అని సజ్జల అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలి అంటూ సీఎం జగన్ కు చంద్రబాబు చేసిన సవాల్ పై సజ్జల స్పందించారు. చంద్రబాబు అసెంబ్లీ వదిలేసి బయట చర్చలకు రమ్మంటున్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్ని ఛాలెంజ్ లు అయినా చేస్తారు. చంద్రబాబు, పవన్ లాంటి వాళ్లకు జగన్ కు ఛాలెంజ్ విసిరే అర్హత లేదు అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

”2014-19 మధ్య ఏం చేశావో చర్చకు వచ్చే సత్తా చంద్రబాబుకు ఉందా..? చంద్రబాబు, పవన్.. తిట్లు తప్ప ఏమీ మాట్లాడలేకపోతున్నారు. మద్యపాన నిషేధం దశలవారీగా అన్నాం. రాష్ట్రంలో బెల్ట్ షాపులు లేకుండా చేశాం. రాష్ట్రంలో మద్యం వినియోగం తగ్గింది. ప్రభుత్వానికి ఆదాయం కావాలి కనుక ప్రభుత్వం షాపులు నడుపుతుంది. గతంలో కంటే వినియోగం తగ్గినా.. ఆదాయం పెరిగింది.. గతంలో ఈ ఆదాయం టీడీపీ చేతుల్లోకి పోయింది. మద్యం విషయంలో అవ్వలేదు కనుకే మ్యానిఫెస్టో 99 శాతం అమలు చేశాం అని చెబుతున్నాం.

Also Read : గుడివాడ వైసీపీలో కొత్త రాజకీయం.. కొడాలి నానికి వైసీపీ అధిష్టానం షాకివ్వబోతుందా?

ఎన్నికలకు 50 రోజులు మాత్రమే ఉంది. అక్కడ తేల్చుకుందాం. ఇంతలో పనికిమాలిన ఛాలెంజ్ లు ఎందుకు..? 50 రోజుల కౌంట్ డౌన్ మొదలైంది. ప్రజలు నిర్ణయిస్తారు. మంచి చేశాం కనుకే ప్రజల వద్దకు వెళ్తున్నాం. వాలంటీర్ వ్యవస్థ తీసేసి జన్మభూమి కమిటీ తెస్తాను అని ఎందుకు చెప్పలేక పోతున్నారు? చంద్రబాబులో ఏమీ చూసి ప్రజలు ఓటు వెయ్యాలి? మేము చెప్పిన వాటిల్లో ఏం చెయ్యలేదో దమ్ముంటే చెప్పండి. 87శాతం ప్రజలు ప్రభుత్వం నుండి లబ్ధి పొందారు.

చంద్రబాబు ఎవరితో పొత్తులు పెట్టుకుంటే మాకెందుకు..? వైసీపీ ఇంటికి వెళ్తుందని చెబుతున్న చంద్రబాబుకి పొత్తులు ఎందుకు..? కూటమి అధికారంలోకి వస్తుంది అంటున్న పవన్ కు పొత్తులు ఎందుకు? ఒంటరిగా పోటీ చెయ్యి. రెండెకరాల నుండి లక్షల కోట్లు ఎలా సంపాదించారో లోకేశ్ చెప్పాలి. టీడీపీ అధికారంలోకి వచ్చేది లేదు. మమల్ని ఏమీ చేసేది లేదు.

Also Read : జనసేన కోరిన చోట బలంగా ఉన్న టీడీపీ ఆశావాహ అభ్యర్థులు.. ఏం జరుగుతోందో తెలుసా?

వాలంటీర్లు ద్వారా 660 కోట్లు అవినీతి ఎక్కడ జరిగిందో చెప్పాలి. గతంలో పెన్షన్ పంపిణీ లో ఇలానే అవినీతి అని తప్పుడు ఆరోపణలు చేశారు. పవన్ పై కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. ఎవరో ఫిర్యాదు చేస్తే కేసు పెట్టారు. చంద్రబాబుతో ఉన్నాడు కనుక కేసు పెట్టారు అనడం సరికాదు. సీపీఎస్ రద్దు చెయ్యాలి అనుకున్నాం. ఎందుకు కాలేదో చెబుతున్నాం. చెయ్యగలిగిందే జగన్ చెప్తారు. అంతేకానీ, చంద్రబాబులా మోసం చెయ్యరు” అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.