త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుంది : కారెం శివాజీ
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు.

త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు.
త్వరలోనే ఏపీ అసెంబ్లీలో పెను సంచలనం జరుగనుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ తెలిపారు. గురువారం (జనవరి 30, 2020) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 17 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తమదేనంటూ స్పీకర్ కు లేఖ ఇవ్వనున్నారని వెల్లడించారు. సైకిల్ గుర్తు కూడా తమకే కేటాయించాలని కోరున్నారని తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో టీడీపీ సంక్షోభంలో కూరుకుపోనుందని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ 2 మండలాలు, 29 గ్రామాలకే పరిమితమైన ఉద్యమాలు చేయడం వల్ల ప్రజలు తిరుగుబాటు చేయనున్నారని తెలిపారు.
గతంలో అమరావతి రైతుల ఆందోళనలపై కారెం శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ల్యాండ్ పూలింగ్‌లో 36 వేల ఎకరాలు ఉదారంగా ఇచ్చి రైతులు త్యాగాలు చేశారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. ఎకరా భూమికి 1700 గజాలు డెవలప్ చేసిన స్థలం.. పదేళ్ల పాటు రూ.50 వేల కౌలు తీసుకునే వాళ్లు త్యాగమూర్తులా అని ఆయన ప్రశ్నించారు. రూ.5 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని డెవలప్ చేసిన తరువాత రూ.3 కోట్ల విలువ పలుకుతుందని భూములిచ్చారని.. వాళ్లేమీ త్యాగాలు చేయలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని కారెం శివాజీ స్పష్టం చేశారు. ఒక అమరావతి కోసం లక్షా పదివేల కోట్లు ఖర్చు పెడితే.. 25ఏళ్ల వరకు రాజధాని అభివృద్ధి చెందదన్నారు. అమరావతిలో కిమీ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు పెడితే.. విశాఖలో రూ.20 లక్షలతో పది కిలోమీటర్లు నిర్మాణం చేయొచ్చన్నారు. ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించే రాజకీయ పార్టీలన్నీ దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఇంగ్లీషు మీడియం కోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని స్పష్టం చేశారు.